టాలీవుడ్: త‌మ సినిమాల్లో కొడుకుల‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న స్టార్ హీరోల‌ లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ నవ్వుల బ్రహ్మ.. బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ కలిసి తాజాగా నటించిన మూవీ బ్రహ్మానందం ఇటీవ‌ల‌ రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా బ్రహ్మానందం కొడుకు రాజ్‌ గౌతమ్‌ మొదటి సినిమా పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో కూడా నటించారు. అంతేకాదు.. ఇద్దరి తండ్రి కొడుకులే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు తమ కొడుకులతో కలిసి స్క్రీన్ ను పంచుకున్నారు. అలా.. నిజజీవితంలో తండ్రి కొడుకులు గా ఉన్న స్టార్ హీరోలు ఎవరెవరు.. తమ కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. ఆ లిస్టె ఏంటో ఒకసారి చూద్దాం.

ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రానికి 40 యేళ్లు..

సీనియర్ ఎన్టీఆర్:
ఎన్టీఆర్ తన చిన్న కొడుకు బాలయ్యతో కలిసి.. దానవీరశూరకర్ణ సినిమాను నటించారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి రౌడీ రాముడు.. కొంటె కృష్ణుడు, అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమాల్లోనూ మెరిశారు.

Mahesh Babu Father Last Rites: Heartbreaking videos of Mahesh Babu from father Krishna's last rites go viral - The Economic Times

సూపర్ స్టార్ కృష్ణ:
సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ కొడుకు దిద్దిన కాపురం సినిమాలో.. మహేష్ బాబుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు వీరిద్దరు టక్కరి దొంగ, రాజకుమారుడు సినిమాలు కూడా క‌లిసి న‌టించారు.

మంచు మనోజ్, మంచు విష్ణుకి సొంత తమ్ముడు కాదా? మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఈ విషయం తెలుసా.. | Times Now Telugu

మోహన్ బాబు:
సీనియర్ హీరో మంచు మోహన్ బాబు.. తన పెద్ద కొడుకు, చిన్న కొడుకు.. మంచు మనోజ్, విష్ణువులతో కలిసి పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో స్క్రీన్ ను పంచుకున్నారు.

Ram Charan on working with Chiranjeevi in Acharya: 'Opportunity came as a blessing in disguise' | Telugu News - The Indian Express

చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి.. త‌న‌యుడు రామ్ చరణ్‌తో కలిసి ఆచార్య సినిమా చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ, మగధీరలోని మెగాస్టార్ తళుక్కున మెరిసి మాయమయ్యాడు.

Nagarjuna, Naga Chaitanya Are Confident Bangarraju Will Be A Success, Reveal It Is A "Proper Sankranthi Festival Film

అక్కినేని నాగార్జున:
టాలీవుడ్ మన్మధుడుగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నాగార్జున.. కొడుకు నాగ చైతన్య‌తో కలిసి ప్రేమమ్‌, మనం, బంగారు రాజు లాంటి సినిమాల్లో నటించాడు. అఖిల్ తో కలిసి అఖిల్.. సినిమాలోని ఆకట్టుకున్నాడు.

ఏఎన్ఆర్:
అక్కినేని నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జునతో కలిసి శ్రీరామదాసు, ఇద్దరు ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, మనం ఇలా చాలా సినిమాల్లో కనిపించారు. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోస్ తండ్రి కొడుకులతో కలిసి నటించే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.