చరణ్ – బుచ్చిబాబు మూవీ మైండ్ బ్లోయింగ్ ఫ్లాష్ బ్యాక్.. ఈసారి బొమ్మ బస్టర్ పక్కా..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక డీలపడింది. ఇక ఈ మూవీలో ఐఏఎస్, ఐపీఎస్ పాత్రలో నటించిన చరణ్.. మ‌రోప‌క్క‌ పొలిటికల్ డ్రామాలోనూ తన నటనతో ప్రశంసలు దక్కించుకున్నాడు. కానీ.. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొల్లగొట్టినా.. మంచి టాక్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పూర్తి ఫోకస్ పెట్టారు చ‌ర‌ణ్‌. ఎలాగైనా ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకోవాలని కసితో పని చేస్తున్నాడు.

Ram Charan Flashback In RC16 To Stun All | cinejosh.com

చ‌ర‌ణ్ – బుచ్చిబాబు సన్న డైరెక్షన్‌లో ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ స్టోరీ.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో బిగ్ స్కేల్‌లో తెర‌కెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్ సరవేగంగా జరుపుకుంటున ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛ‌స్త్రంజ‌ర్‌ సినిమా లాగా.. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని టాక్‌ నడుస్తుంది. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా మొత్తం మీద.. ఆడియన్స్‌కు కొద్దొ.. గొప్ప.. పర్లేదు అనిపించిందా ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మాత్రమే. ఇప్పుడు చర‌ణ్‌ నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉండనుంద‌ని సమాచారం.

A Sneak-peek Of Charan's Look In RC16

అంతేకాదు ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ డైరెక్టర్ బుచ్చిబాబు మైండ్ బ్లోయింగ్ లెవెల్ లో ప్లాన్ చేశాడట. ఇదిలా ఉంటే సినిమాలో చరణ్ 2 డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని.. అందులో ఓ పాత్ర నార్మల్గా ఉంటే.. ఫ్లాష్ బ్యాక్‌ పాత్ర మాత్రం.. ఏకంగా 10 కేజీల బరువు తగ్గి సరికొత్త లుక్ తో కనిపించనున్నాడట. కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే చరణ్ ఈ రేంజ్ లో ఎఫర్ట్స్ పెడుతున్నాడు అంటే.. సినిమాపై ఆయనకు ఉన్న ఇష్టమేంటో అర్థమవుతుంది. ఈ క్రమంలో చరణ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అంతేకాదు చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక సినిమా చరణ్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో.. ఈ సినిమాతో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకుంటాడో వేచి చూడాలి.