టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్, పవన్, రవితేజలకు ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లు ఇచ్చి స్టార్ హీరోలుగా నిలబెట్టిన పూరి జగన్నాథ్ ఇమేజ్.. ఇటీవల కాలంలో మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత రేంజ్‌లో డౌన్ ఫాల్ పూరి ఎదుర్కొంటున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో తీసిన లైగర్ ఘోరమైన డిజాస్టర్ కాగా.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన డబ్బులు అస్మార్ట్ బాక్సాఫీస్ దగ్గర డీలపడింది.
దీంతో పూరి జగన్నాథ్ తను ఎంచుకునే కథల విషయంలో శ్రద్ధ చూపించాలని కామెంట్లో వినిపిస్తున్నాయి. ఇక పూరి జగన్నాథ్, మహేష్ కాంబోలో తెరకెక్కిన పోకిరి సినిమాతో.. ఓ సినిమా ఆడియన్స్‌కు నచ్చి.. వారిని మెప్పిస్తే భారీ వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చూపించాడు పూరి. అంతే కాదు.. పూరి జగన్నాథ్ ఏ సినిమా మేకింగ్ కైనా పెద్దగా సమయం తీసుకోడు. చక చకా సినిమా పనులు పూర్తి చేసేసి షూట్ కూడా.. త్వరగా ముగించేస్తాడు. అలాంటి పూరీ జగన్నాథ్.. మళ్లీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన సినిమా పోకిరి అనడంలోనూ అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో పూరి.. మహేష్ బాబుకు సంబంధించి చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు నైజం ఏంటో పూరి రివిల్ చేశాడు. మహేష్ తో ఓ సినిమా చేస్తున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన రియాక్ట్ అవుతూ.. కొంతకాలంగా హిట్స్‌కు దూరంగా ఉన్నా.. నాతో అసలు మహేష్ సినిమా చేయడానికి ఒప్పుకోడని చెప్పుకొచ్చాడు. మరి ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితే సినిమా చేస్తారా అని యాంకర్ అడిగితే.. నేను మహేష్ తో చేయనంటూ కుండబద్దలు కొట్టినట్లుగా కామెంట్ చేశారు. అయితే పూరి జగన్నాథ్ మహేష్ బాబుని ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారుతున్నాయి.