వాళ్లు వీళ్లు ఎవరు కాదు.. చివరకు ఆ డైరెక్టర్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఫిక్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమాతో త‌న ఇంటర్నేషనల్ లెవెల్‌కు పెంచుకున్నాడు. ఈ సినిమాతో బన్నీ మార్కెట్, పాపులర్టీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత బన్నీ.. పుష్ప 3లో నటిస్తాడ‌ని అంతా భావించారు. కానీ ఈ మూవీ ఇప్ప‌ట్లో సెట్స్‌ పైకి రాదని తేలిపోయింది. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఏమై ఉంటుంది అని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా.. పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పటి నుంచి అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో త‌న నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అంటూ టాక్‌ నడిచిన సంగతి తెలిసిందే. తర్వాత తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే అట్లి చెప్పిన కథ అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో కథను రిజెక్ట్ చేశాడని.. దీంతో అట్లీ ఆ కథను వేరొకరితో చేయడానికి ఫిక్స్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి.

Allu Arjun and Trivikram Srinivas Collaborate for the Fourth Time 'To  Create a Visual Spectacle' (Watch Video) | 🎥 LatestLY

ఇక తాజా సమాచారం ప్రకారం.. బన్నీ తన నెక్స్ట్ సినిమాను మాటలు మంత్రికుడు త్రివిక్ర‌మ్‌తోనే పిక్స్‌ చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సర్వే గంగా జరుగుతున్నాయని.. రీసెంట్ గానే త్రివిక్రమ్, బన్నీని కలిసి స్టోరీ ఫుల్ నరేషన్‌ చేసినట్లు సమాచారం. మైథాలాజికల్, పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని.. నెవర్‌ బిఫోర్ లుక్‌తో బ‌న్నీ సినిమాలో కనిపించబోతున్నాడని.. శివ – పార్వతి పుత్రుడు కార్తికేయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు సమాచారం. సోషియ ఫాంటసీ.. మైథాలజికల్ డ్రామాగా మూవీ ఉండనుందని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇక‌ సినిమా తండ్రి, కొడుకులు.. శివుడు, కార్తికేయ పున కలయికను చూపించబోతున్నాడట త్రివిక్రమ్.

AA22 Is A Socio-Mythological Fantasy Based on Lord Kartikeya Journey |  cinejosh.com

ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే త్రివిక్రమ్ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ కాయం.. మాటల మాంత్రికుడు కాంపౌండ్ నుంచి మరో భారీ హిట్ ప‌క్కా అంటూ సినీ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ టైటిల్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించనున్నట్లు టాక్ న‌డుస్తుంది. ఏఏ 22 రన్నింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా చిన్న వీడియో రూపంలో త్వరలోనే రిలీజ్ చేయనున్నారట. ఇక మొట్టమొదటిసారి బన్నీతో డిఫరెంట్ కాన్సెప్ట్ తెర‌కెక్కించడానికి సిద్ధమైన త్రివిక్రమ్.. ఈ సినిమాతో ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడో వేచి చూడాలి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంటపురంలో ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ కాంబోలో సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.