చ‌ర‌ణ్ – సుక్కు కాంబో హీరోయిన్‌గా ఆ క్రేజి బ్యూటీ.. ఫ్యాన్స్ అస‌లు ఊహించ‌ని ఫిగ‌ర్‌..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. చరణ్‌ తన నెక్స్ట్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్‌సీ 16 సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని.. నెక్స్ట్ షెడ్యూల్ సెట్ వర్క్‌లో బిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్రమంలోనే షుట్‌కు గ్యాప్ రావడంతో.. చరణ్ కాస్త డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి.. అబుదాబికి వెళ్ళాడు.

Buzz: Rashmika in Ram Charan's Film? - Telugu360

బుచ్చిబాబు సినిమా తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. పిరియాడిక్ జ‌న‌ర్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమా స్టోరీ గురించి అబుదాబిలో గత రెండు రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ సినిమాకు హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని భావిస్తున్నారట. పుష్ప సినిమాలో ఈమె పర్ఫామెన్స్ హైలైట్ అవ్వడమే కాదు.. నటనకు ప్రశంసలు కూడా వచ్చాయి. పలు సందర్భాల్లో పుష్ప క్యారెక్టర్ ఎలివేట్ చేయడంలో.. అద్భుతమైన నటన కనబరిచింది. ఈ క్రమంలోనే చరణ్‌తో తీయబోయే సినిమాల్లో హీరోయిన్ పర్ఫామెన్స్‌కే ఫుల్ స్కోప్ ఉందని.. దీంతో రష్మిక అయితే సినిమాకు కరెక్ట్ అని సుకుమార్ భావిస్తున్నాడట.

RC17: Sukumar's Never Before Genre with Charan?

ఈ క్రమంలోనే చరణ్‌కు మ్యాటర్ చెప్పి ఒప్పించాడని.. లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ఈ ఏడది అక్టోబర్ క‌ల్లా సినిమా షూట్ అంతా పూర్తి చేసి.. వెంట‌నే సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్‌. ఇక డిసెంబర్ నుంచి సుకుమార్ తో సినిమా షూట్‌కు రామ్ చరణ్ సిద్ధ‌మౌతాడ‌ని.. వచ్చేయడాదే ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు రానుందని.. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి పడనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ చరణ్ కోసం సిద్ధం చేశాడని సమాచారం. పుష్ప క్యారెక్టర్ తో అల్లు అర్జున్‌ను ఆయన ఏ రేంజ్ లో నిలబెట్టాడో చూసాం. ఇక వరుసగా డిజాస్టర్ ప్లాపుల్లో ఉన్న చరణ్‌కు అంతకుమించిన క్యారెక్టర్ డిజైన్ చేసి గిఫ్ట్ గా ఇవ్వాలని సుక్కు ఫిక్స్ అయ్యాడట. ఇక చరణ్ ని ఈ సినిమాలో సుకుమారి ఏ రేంజ్ లో ఎలివేట్ చేయనున్నాడో వేచి చూడాలి.