చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్‌.. ఆ మ్యాటర్ తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో అయినా.. కేవలం ఐదు, ఆరు నెలల్లో సినిమా తెరకెక్కించే బ్లాక్ బస్టర్ కొట్టగల సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తాజాగా విక్టరీ వెంకటేష్ తో నాలుగు నెలల వ్యాధిలోని సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసి బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అది కూడా రూ.100 కోట్లు కొట్టడం కష్టమనే వెంకీ సినిమాకు ఏకంగా రూ.300 కోట్లు కొట్టి చూపించాడంటే.. అనిల్ రావిపూడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎఫ్2 సినిమాతో వెంకీకి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్.. సంక్రాంతికి వస్తున్నాం తో మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కట్టబెట్టాడు. బాలయ్య, చరణ్‌ను వెనక్కునిట్టి మ‌రీ సంక్రాంతి విన్నర్ గా వెంకీ నిలిచాడు.

200 Cr At Stake: Chiru-Anil Must Deliver! | 200 Cr At Stake: Chiru-Anil  Must Deliver!

ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న అనిల్.. చిరంజీవి సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో చిరు జాయిన్ కానున్నాడు. 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్. శ‌ర‌వేగంగా షూట్ ను పూర్తిచేసి సంక్రాంతికి వచ్చేలా భావిస్తున్నాడట. అందులో భాగంగా నాలుగు సాంగ్స్ కూడా ఫైనల్ చేశాడని తెలుస్తుంది. అంతే కాదు.. అనిల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్‌కు ఈ మూవీ సంగీతం కూడా ఓ కార‌ణం.

Bheems Ciceroleo Archives - TrackTollywood

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా బీమ్స్‌రోలియో వ్య‌వ‌హ‌రించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు సినిమాకి కూడా బీమ్స్రోలియో సంగీతం అందిస్తున్నాడని.. ఇప్పటికే ఆ నాలుగు సినిమాల సాంగ్స్ కు మ్యూజిక్ పూర్తి చేశాడని సమాచారం. ఇక తాజా ఈవెంట్‌లో రాఘవేందర్రావు.. చిరు, అనిల్ కాంబో సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడితే బాగుంటుంది అంటూ వెల్లడించాడు. ఈ క్రమంలోనే మాస్ వైబ్రేషన్స్ తో కూడిన ఈ టైటిల్ కావ‌డం.. అది కూడా ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు చెప్పడంతో అనిల్ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మాస్, కమర్షియల్ హక్కులతో చిరంజీవి సినిమా ఉండబోతుందట. ఇక ఎప్పుడెప్పుడు అనిల్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చేస్తున్న అంటూ చిరంజీవి చెప్పుకోచిన సంగతి తెలిసిందే. కథ‌ వింటున్న సమయంలో.. చాలాసార్లు నవ్వుకున్నానని.. ఇది కచ్చితంగా ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే మూవీ అవుతుందంటూ చిరంజీవి వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో చిరును.. అనిల్ ఎలాంటి క్యారెక్టర్‌లో చూపిస్తాడు వేచి చూడాలి.