ఈ ఫోటోలో కనిపిస్తున్న గుండు పాప.. పాన్ ఇండియన్ పాపులర్ బ్యూటీ.. ఎవరు గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఈ చిన్న వింత జ‌రిగినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది. అదే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో, హీరోయిన్లు.. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అయితే మరింత వేగంగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్ కూడా అభిమానులకు దగ్గర అయ్యేందుకు సోషల్ మీడియా వేదికను ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకుంటున్నారు. అంతేకాదు.. తమకు సంబంధించిన ప్రతి విలువైన విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన బాల్య జ్ఞాపకాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.

అలా.. తాజాగా ఓ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన చిన్ననాటి తీపి గుర్తులను అభిమానులతో పంచుకుంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న గుండు పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు పాన్ ఇండియన్ పాపులర్ స్టార్ బ్యూటీ. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. పురుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా.. హాలీవుడ్ లో సైతం తిరుగులేని క్రేజ్ అమ్మ‌డి సొంతం. ఇక ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలోను ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. సర్లేండి మేము చెప్పేస్తాం. తనే స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె త‌న‌ సోషల్ మీడియా వేదికగా.. స్వీట్ మెమోరీస్ ను షేర్ చేసుకుంది.

Priyanka Chopra: quién es, su carrera y cómo fue su boda con Nick Jonas | Vogue

ప్రియాంక 1987 నుంచి 2008 వరకు జీవితంలో జరిగిన ఎన్నో మధురమైన క్షణాలను పంచుకుంది. తను ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంది. అయితే తన చిన్నప్పుడు గుండుతో గోగల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో దిగింది. ఈ క్ర‌మంలోనే తన చిన్ననాటి ఫోటోకి, ఇప్పటికి అసలు పోలికలు లేవంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రియాంకను రోజు ఫాలో అయ్యే అతి తక్కువ మంది ఫ్యాన్స్ మాత్రం.. తన కూతురు మాల్టీలానే క‌నిపిస్తుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ,దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ సినిమాలో న‌టిస్తున్న‌ సంగతి తెలిసిందే. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొంద‌నుంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)