రాజమౌళి కుటుంబంలో విషాదం.. మహేష్ మూవీకి బ్రేక్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి స్టార్ డైరెక్టర్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుకున్న జక్కన్న.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో రుచి చూపాడు. అంతేకాదు.. వరల్డ్ వైడ్ గా సినీనటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ సినిమాతో తెలుగు గడ్డపైకి తీసుకువచ్చిన ఘనత జక్కన్నదే. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్‌తో.. మొట్టమొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్‌తో ఎస్ఎంబి 29 రూపొందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా రూపొంది.

అయితే 2025 జనవరి 2న పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని షూట్ ప్రారంభించినట్లు వార్తలు వినిపించిన.. దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. తర్వాత మహేష్ తో పాటు ఇతర ప్రధాన తారాగణాన్నంతా సెట్స్ లోకి రప్పించి వారి డేట్స్ లాక్ చేసినట్లు ట్విట‌ర్ ద్వారా హింట్‌ ఇచ్చాడు జక్కన్న. అప్పటినుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్‌ మధ్య షూటింగ్ కొనసాగుతూనే ఉంది. కొన్ని కారణాలతో తాజాగా సినిమా షూట్‌కు బ్రేక్ పడిందని సమాచారం. ఇక తాజాగా ప్రియాంక చోప్రా కారణంగా సినిమాకు కాస్త గ్యాప్ వచ్చిందట‌. ఆమె సోదరుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉండడంతో సినిమా షూట్ కు బ్రేక్ పడిందని.. దానికి తగ్గట్టుగానే రాజమౌళి దగ్గర బంధువుల్లో ఒకరు మరణించడంతో కుటుంబ సభ్యులంతా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని.. ఇలా అనివార్య కారణాలతో ఎస్ఎస్ఎంబి 29 షూట్‌కు సడన్ బ్రేక్ పడిందని సమాచారం.

Video: Did Priyanka Chopra confirm collaboration with Rajamouli with RRR music?

ఈ క్రమంలోనే గత వారం అంత గ్యాప్ తీసుకున్న టీం.. మళ్లీ తాజాగా షూటింగ్ ప్రారంభించారట. ఇండోనేషియా న‌టి చెల్సియా ఇస్లాం ఈ సినిమాలో మహేష్ బాబు జంటగా నటించబోతుందని సమాచారం. మరోవైపు ప్రియాంక చోప్రా కూడా మహేష్ కు జంటగా నటిస్తుందని టాక్. ఈ క్రమంలోనే జక్కన్న ప్లాన్ ఎలా ఉండనంత వేచి చూడాలి. ఇక బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో పాటు.. పలువురు హాలీవుడ్ తారలు కూడా ఈ సినిమాలో మెరువనున్నారట‌. ఇక ప్రస్తుతం స్పెషల్ సెట్స్ లో సినిమా షూట్ జరుగుతుంది. షూటింగ్ స్పాట్‌లో జక్కన ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడడానికి బ్యాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న లీక్ కూడా బయటకు రాకుండా రాజమౌళి పగడ్బందీగా ప్లాన్ చేశారని.. ఫుల్ సెక్యూరిటీతో సినిమాను షూట్ చేస్తేన్నార‌ట‌.