నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా.. ఇన్నాళ్లు రివీల్ కానీ ఇంట్రెస్టింగ్ సీక్రెట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి సినీ దిగ్గజాలలో ఒకరుగా అక్కినేని నాగేశ్వరరావు ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నారో తెలిసిందే. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తనదైన నటనతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఏఎన్ఆర్.. మరణించిన తర్వాత ఆయన లెగిసిని తన తనయుడు నాగార్జున కొనసాగిస్తూ వస్తున్నాడు. అక్కినేని కింగ్, టాలీవుడ్ మన్మధుడుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు నాగార్జున. ఇక నాగార్జున కూడా తన సమీకరణలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందించాడు.

కాగా.. ఇటీవల కాలంలో నాగార్జున సినిమాల ప‌రంగా కాస్త నెమ్మదించిన.. వ్యాపార పరంగా మాత్రం బిగ్ షాట్‌లా దూసుకుపోతున్నాడు. ఇక బిగ్‌బాస్ కార్యక్రమానికి హోస్ట్‌గాను వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు నాగ్. అయితే ఇటీవల కాలంలో నాగర్జున నుంచి సినిమాలు రాకపోవడంతో.. అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జునకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అయితే.. అక్కినేని నాగార్జున అంటేనే అందరికీ తెలుస్తుంది.

నాగార్జున అసలు పేరు అది కాదా.... అసలు పేరు ఏంటో తెలుసా... ఇన్నాళ్లు తెలియనే  లేదే

కానీ.. అసలు నాగార్జున పేరు అది కాదట. ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి నాగార్జున అస్సలు పేరు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశాడు. ఓ సందర్భంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నాగార్జున అసలు పేరు నాగార్జున మాత్రమే కాదని.. ఆయన పూర్తి పేరు నాగార్జునసాగర్ అంటూ చెప్పుకొచ్చాడు. సాగర్‌ కంటే.. నాగార్జున బాగుందని, క్యాచీగా ఉంద‌ని.. నాగార్జున అనే ఫిక్స్ చేసుకున్నారంటూ ఆయన వెల్లడించాడు. ఇక అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు నాగార్జున తన అసలు పేరు నాగార్జున సాగర్‌గా ఎక్కడ బయటకు చెప్పకపోవడం విశేషం.