తార‌క్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న న‌య‌న్ కిడ్స్‌.. విడియో వైర‌ల్‌..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. తాజాగా దేవరతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాతో.. తారక్ మంచి సక్సెస్ అందుకుని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్ పెట్టాడు. అంతేకాదు.. జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడం ఈ సినిమా సక్సెస్‌కు మరింత హైలెట్గా నిలిచింది. కొరటాల డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో తార‌క్ నటించిన సంగతి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

Chuttamalle Audio Song | Devara | NTR | Janhvi Kapoor | Anirudh Ravichander | Shilpa Rao | 27 Sep

ఇక దేవర సినిమాకు అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలో సాంగ్స్ సైతం భారీ సక్సెస్ అందుకున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ అయితే సంచలనం సృష్టించింది. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ప్రతి ఒక్క ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలాగే జాన్వి తన అందాలతో ఆకట్టుకుంది. ఈ సాంగ్ ఎంత పాపులారిటీ దక్కించుకుందంటే.. సాధారణ ఆడియన్సే కాదు.. స్టార్ సెలబ్రిటీస్ సైతం ఈ సాంగ్‌కు తెగ రీల్స్ చేసే రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ముఖ్యంగా సాంగ్ మధ్యలో ఆ.. అంటూ వచ్చే సౌండ్ కు చిన్న చిన్న పిల్లలు సైతం బాగా కనెక్ట్ అయ్యారు.

Nayanthara kinds: అ.. సో క్యూట్ .. NTR 'చుట్టమల్లే' పాటకు నయన్ పిల్లలు ఏం చేశారో చూడండి!

ఈ క్రమంలోనే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార పిల్లలు దేవర సాంగ్ హమ్ చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారుతుంది. నయనతార కొడుకులు ఇద్దరు కూడా.. దేవర సాంగ్ లో వచ్చే ఆ సౌండ్ కు ఎడిక్ట్ అయ్యారు. కారులో వెళుతున్న టైం లో సాంగ్ ప్లే అవుతుండగా.. సాంగ్ మధ్యలో నయన్‌ కొడుకు ఆ.. అని హమ్ చేస్తున్న వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తార‌క్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. భ‌లే క్యూట్‌గా హ‌మ్ చేస్తున్నాడంటూ క‌మెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)