నేడు దివంగత స్టార్ బ్యూటీ విజయ నిర్మల జయంతి సందర్భంగా.. ఈమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అలనాటి స్టార్ హీరోయిన్గా, డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయనిర్మల తన సినీ కెరీర్‌లో ఎన్నో తిరుగులేను రికిర్డ్‌లు సొంతం చేసుకుంది. ఇక 2019లో తన తుది శ్వాస విడిచి అభిమానులను శోకసంద్రంలో నెట్టారు. కాగా.. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలిగా విజయనిర్మల తిరుగులేని ముద్ర వేసుకుంది. అంతేకాదు తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంది.
నీరజగ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తర్వాత విజయనిర్మలగా మారి నేచురల్ నటిగా రాణించింది. దర్శకురాలిగా మారి ఏకంగా 42 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డును సృష్టించింది. అప్పటివరకు 22 సినిమాలు తీసిన ఇటలీ లేడి డైరెక్టర్ రికార్డును బ్రేక్ చేసి తన పేరును గిన్నిస్ రికార్డులో నెలకొల్పుకుంది. ఇక ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు మహిళా దర్శకురాలు కూడా విజయనిర్మలనే. 1957లో తెలుగులో వచ్చిన పాండురంగడు మహత్యం సినిమాలో బాలనట్టిగా.. కృష్ణుడి పాత్రలో మెరిసిన ఈమె.. తన 60 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని తిరుగులేకుండా కొనసాగించింది. ముఖ్యంగా ఆమె భర్త సూపర్ స్టార్ కృష్ణ తో.. ఏకంగా 50 సినిమాల్లో నటించింది. ఇది కూడా ఆమె కెరీర్‌లో గ్రెట్ రికార్డ్.
విజయనిర్మల దర్శకురాలుగా మాత్రమే కాదు.. టెక్నికల్ ఆర్టిస్ట్ గా కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. దర్శకురాలుగా మంచి పేరు తెచ్చిన సినిమా దేవుడే గెలిచాడు. ఆ సినిమా తర్వాత ఏడాదికి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది విజయనిర్మల. ఇక మల్టీస్టారర్ ట్రెండ్‌తో కొత్త ప్రయోగాలు ఘనత కూడా ఆమెదే. భర్త కృష్ణతో.. మరో హీరోను జోడించి మల్టీ స్టారర్ సినిమాను రూపొందించింది. ఏఎన్ఆర్, కృష్ణ కాంబినేషన్లో.. హేమా – హేమీలు, కృష్ణ – శివాజీ గణేషన్ కాంబినేషన్లో.. బెజవాడ ఇలా ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలకు దర్శకత్వం వహించింది. అప్పట్లోనే మల్టీ స్టారర్ ఎక్స్పరిమెంట్లతో సక్సెస్ లో అందుకుంది. అయితే వాటిలో కొన్ని పరాజయాలు కూడా వచ్చాయి. ఇక ఓవైపు దర్శకురాలిగా రాణిస్తూనే.. మరోవైపు నటిగాను భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం.