నందమూరి నటవారసుడిగా టైటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో సత్తా చాటుకుంటున్న తారక్.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరికీ గట్టి పోటీ ఇస్తూ.. తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునేందుకు కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్‌లు అందుకున్నాడు. గత పదిహేడుగా ఫ్లాప్ అన్నది లేని హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న తారక్ టాలీవుడ్‌లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగల హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యత ఉండేలా చూసుకుంటాడు. గత సంవత్సరం కొరటాల డైరెక్షన్లో దేవర సినిమా నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోకపోవడంతో.. మిగతా స్టార్ హీరోల రేసులో కాస్త వెనుకబడిన.. నెక్స్ట్ రాబోయే సినిమాతో అంతకుమించి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ – ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే సంవత్సరం ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం సినిమా షూట్ ను రామోజీ ఫిలిం సిటీలో మొదలుపెట్టారు టీం. ఇక సినిమా కోసం మహారాష్ట్రకు సంబంధించిన భారీ సెట్లు వేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీలో సినిమాలు అంటేనే భారీ సెట్స్ ఉంటాయి. కనుక ఈ సినిమాలో కూడా అలాంటివి మనం చూడబోతున్నాం.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమాలో యాక్షన్ కూడా పుష్కలంగా ఉండబోతుందని సమాచారం. 1950 నాటి బ్యాడ్ డ్రాప్ స్టోరీ తో ఈ సినిమా రూపొందట. ఇక ఇప్పటికే తన సినిమాలతో ఇండస్ట్రీలో సత్తా చాటుకున్న ప్రశాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేసి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సలార్ తో ప్రభాస్‌కు భారీ సక్సెస్ అందించిన ప్రశాంత్.. ఎన్టీఆర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తాడో.. ఏ రేంజ్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసి పెడతాడు చూడాలని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నాడని.. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే యోధుడిగా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా.. తారక్ క్యారెక్టర్ ను ప్రశాంత డిజైన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.