ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2ను ఇంటర్నేషనల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బన్నీ గతంలో తాను తీసుకున్న ఒకే ఒక్క షాకింగ్ డెసిషన్‌తో అతిపెద్ద అట్టర్ ప్లాప్‌ను మూట గట్టుకున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ అల్లు అర్జున్ తీసుకున్న ఈ షాకింగ్ డెసిషన్ ఏంటో.. అంత పెద్ద అట్టర్ ప్లాప్ ను మూట కట్టుకోవడానికి వెనుక కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల కిందట నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అనూ ఇమన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు వక్కాంతం వంశీ దర్శకుడుగా వ్యవహరించాడు. ఈ సినిమాతోనే వంశీ డైరెక్టర్ గా తన కెరీర్ అన్న ప్రారంభించాడు.
అయితే ఈ సినిమాకు మొదట వంశీ.. అల్లు అర్జున్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాడట. మొదట ఎన్టీఆర్ కోసం వంశీ ఈ కథను రెడీ చేసుకుని ఆయనకు వినిపించారట. కథ మొత్తం విన్న తారక్ తన డెసిషన్ను హోల్డ్ లో పెట్టి వెయిట్ చేయించారు. అయితే ఎన్టీఆర్‌కు వంశీ కథ చెప్పి వస్తున్న క్రమంలోనే అల్లు అర్జున్ ఆయనకు కనిపించడం.. ఎక్కడికి వెళ్లి వస్తున్నారని బన్నీ వంశీని అడగడం.. ఎన్టీఆర్ గారికి ఒక కథ చెప్పి వచ్చానంటూ వివరించాడట. బన్నీ.. నాకు కూడా సరదాగా కథ చెబుతారీ అని వంశీని ప్రశ్నించగా.. అయినా కథ మొత్తం చెప్పాడట. కథ విన్న అల్లు అర్జున్ అయితే మీరు త్వరలోనే బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నారంటూ చెప్పాడట.
ఆ తర్వాత తారక్ కథను రిజెక్ట్ చేశాడు. అయితే ఒక సందర్భంలో బన్నీ.. ఎన్టీఆర్‌తో ఫోన్లో మాట్లాడుతూ భలే కథ పట్టావు తారక్.. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నావ్ అంటూ మాట్లాడడం.. కానీ తారక్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో వంశీ ద్వారా మేటర్ తెలుసుకున్న బన్నీ.. ఆ కథ నీకు ఓకే అయితే నేను నటిస్తాను అని బన్ని చెప్పాడట. దానికి వంశీ కూడా ఓకే చెప్పడంతో.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా పట్టాలెక్కింది. అయితే సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా అల్లు అర్జున్ తీసుకున్న ఒకే ఒక్క చిన్న నిర్ణయం ద్వారా.. బన్నీ భారీ ఫ్లాప్‌ను మూట కట్టుకున్నాడని సమాచారం.