టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో పక్క సమయం దొరికినప్పుడల్లా సినిమా షూట్లలోను పాల్గొంటు తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు.. తను వెళ్లే చాలా చోట్లకు కొడుకు అకీరాను తీసుకువెళుతూ సందడి చేస్తున్నాడు పవన్. ఈ క్రమంలోనే తండ్రి, కొడుకులని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు. అకీరా నందన్ త్వరగా సినిమా ఎంట్రీ ఇస్తే బాగుండని.. ఎప్పుడెప్పుడు ఆయన డెబ్యూ మూవీ చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి క్రమంలో అకీరా డబ్యూ మూవీ మరో రెండేళ్లలో ఉండనుంది అంటూ టాక్ నడుస్తుంది. అంతేకాదు.. సినిమా కోసం ఒక క్రేజీ డైరెక్టర్ కథను కూడా సిద్ధం చేశాడని.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని టాక్. ఎస్.. మీరు వింటున్నది కరెక్టే. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అకీరా నందన్ డబ్బింగ్ మూవీ ఉండనుందని వార్తలు నిన్న మొన్నటి వరకు తెగ వైరల్‌గా మారాయి.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్, అకీరా కాంబోలో మూవీ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. కేవలం ఇవన్నీ ఎర్లీ రొమన్స్ మాత్రమే అన్ని.. అకీరా డెబ్యూకి ఇంకా రెండేళ్లు సమయం ఉండడంతో.. దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదని.. ఆ సమయం వచ్చినప్పుడు డిసైడ్ అవుతారని సమాచారం. ఈ క్రమంలోనే టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ డబ్యూగా ఎంతోమంది ఎదురుచూస్తున్న ఈ సినిమాపై మరిన్ని సందేహాలకు క్లారిటీ రావాల్సి ఉంది.