టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్ తాజాగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు. దాదాపు ప్రశాంత్.. ఇప్పటివరకు వాడిన.. అన్ని సినిమాలకు అలవాటైన.. రొటీన్.. బ్లాక్, గ్రే టింట్ తోనే ఆ స్టిల్ కనిపించింది. కాగా ఈ స్టీల్‌లో అంబాసిడర్ కారు, సైకిళ్ళు.. రోడ్డు మీద అల్లర్లు జరిగినట్లుగా సెట్స్ వేశారు. ఈ నేపధ్యంలో ఇంతకీ బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుంది.. సినిమాలో తారక్‌ను ఎలా చూపించబోతున్నాడని.. ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్, తారక సినిమా కథ 1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందట.
సినిమా మొత్తం ఒకే నేపథ్యంతో కొనసాగుతుందని.. ఈ జనరేషన్ కు అసలు సంబంధమే ఉండదని తెలుస్తుంది. 1960లో బెంగాల్ పరిస్థితిల నేపథ్యంలో రాసుకున్న ఈ కథను.. నీల్ మరింత ఎఫెక్టివ్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. సినిమా మొత్తం ఒకటే జానర్‌లో తెరకెక్కనుందట. అంతేకాదు.. ఒకటే టైమ్ పీరియడ్‌లో.. అది కూడా 1960 టైం పీరియడ్ లోనే సినిమా అంతా కొనసాగుతుందని తెలియడం అభిమానులలో ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ కథకు తగినట్లుగానే ఎన్టీఆర్ గెటప్ కూడా డిజైన్ చేశాడట ప్రశాంత్.
1960 కలకత్తా బ్యాక్ డ్రాప్ కనుక అప్పటి కాలంలానే సెట్స్ వేయాల్సి ఉంటుంది. ఇక గతంలో ఇదే బ్యాక్‌డ్రాప్.. వింటేజ్ కోల్కత్తాను నాని ఓ సినిమాలో చూపించారు. ఆయన నటించిన శ్యామ్ సింగ రాయ్.. బెంగల్ నేపథ్యంలోని తెరకెక్కింది. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ కూడా అదే బెంగాల్ నేపథ్యంలో యాక్షన్ సినిమాలో నటించనున్నారు. కాగా ఇప్పటివరకు కోల్కత్తా బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన టాలీవుడ్ సినిమాలన్నీ మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాను కూడా అదే బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్ రావడం ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.