సాధారణంగా సినీ సెలబ్రిటీ, స్టార్ హీరో, హీరోయిన్లు ఇంటి కోసం లక్షల్లో ఖర్చు చేస్తారన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే నెలకు ఏకంగా రూ.24 లక్షలు అద్దె ఎవరైనా కడతారా.. అసలు అంత కాస్ట్‌లీ ఇల్లు ఇండియాలో ఉన్నాయా.. అనే సందేహాలు చాలామందిలో ఉండొచ్చు. కానీ.. అలాంటి హౌస్ లు, అపార్ట్మెంట్లు ఇండియాలో ఉన్నాయని టాక్ నడుస్తుంది. ముంబైలోనే అలాంటి కాస్ట్‌లీ రిచెస్ట్ హౌస్ లో ఉన్నాయి. వాటికే నెలకు ఏకంగా రూ.24 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్.
ముంబైలోని పాలిష్ ఏరియాలో 2 లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. షారుక్ ఖాన్ దాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఏడాదికి ఏకంగా రూ.2కోట్ల.. రూ.90 లక్షల అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని మరీ ఆ హౌస్ రెంట్ తీసుకున్నాడంటూ.. అంటే నెలకు ఇంచుమించు రూ.24 లక్షల వరకు రెంట్ పడుతుంది. ఇంతకీ ఆ లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఎవరిదో చెప్పలేదు కదా.. ఈ ప్రాపర్టీస్ అన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త స్టార్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానికి చెందిన ప్రాపర్టీస్ అని తెలుస్తుంది.
కాగా పై చెప్పిన భారీ మొత్తానికి జాకీ భగ్నాన్ని నుంచే లీజకు తీసుకుంటున్నాడు షారుక్. అయితే షారుక్ ఖాన్ ఈ హౌస్ లో ఉంటాడా అంటే లేదు. ముంబైలోనే ఆయనకు మరో భారీ నివాసం ఉంది. తన భార్య, పిల్లలతో కలిసి అక్కడే ఆయన ఉంటున్నాడు. కానీ.. అదనపు అవసరాలకు ఈ రెండు లక్షలు డూప్లెక్స్ ఫ్లాట్లను ఆయన లీజుకు తీసుకున్నడట. అంతేకాదు.. ఈ డీల్ వెనక ఇన్కమ్ టాక్స్ లెక్కలు, వ్యవహారాలు కూడా ఉన్నాయని బిటౌన్‌లో టాక్ వైరల్ గా మారుతుంది.