టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా అనే పదాన్ని ఇండియన్ హిస్టరీకి పరిచయం చేసిన డైరెక్టర్గా రాజమౌళి గనత సాధించాడు. తన డైరెక్షన్ స్కిల్స్‌తో.. టాలీవుడ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన రాజమౌళి భార్య.. రమా రాజమౌళి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక అప్పటికే పెళ్ళై.. బాబు ఉన్న రమాను ప్రేమించి మరి రాజమౌళి వివాహం చేసుకున్నారు. అయితే రాజమౌళి.. రమను పెళ్లి చేసుకోవడంతో ఎన్నో విమర్శలు, వార్తలు గుప్పుమన్నాయి. కాగా వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న ప్రేమతో వారు తమ బంధం పై చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు.
ఈ క్రమంలోనే రమా కొడుకు కార్తికేయ కోసం.. రాజమౌళి మళ్లీ పిల్లల్ని కూడా కనకుండా అలాగే ఉండిపోయారు. ఇక ఈ విషయం పక్కన పెడితే రాజమౌళికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారుతుంది. రాజమౌళి.. రమకంటే ముందు మరో స్టార్ హీరోయిన్ ప్రేమించాడట. ఆమె అంటే ఎంతగా ఇష్టమంటే.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉండేవారట. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. మహానటి సావిత్రి. ఎస్.. ఇది నిజమే. సావిత్రి అంటే రాజమౌళికి మొదటి నుంచి చాలా ఇష్టమట.
చిన్న వయసు నుంచే సావిత్రి సినిమాలను చూస్తూ ఎంతో ఇష్టంగా పెరిగిన ఆయన.. తనపై ఎంతగానో ప్రేమను పెంచుకున్నాడంటే.. ఒక విధంగా చెప్పాలంటే తాను పెద్దయ్యక సావిత్రిని పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్ తో ఉండేవాడట. కానీ.. చివరకు సావిత్రికి పెళ్లి అయిపోయింది. అలాగే ఆమె.. తన కంటే వయసులో చాలా పెద్దదని తెలిసిన తర్వాత మెల్లమెల్లగా తనకి తానే సర్ది చెప్పుకొని సావిత్రిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన విడిచిపెట్టాడట జక్కన. ఇదంతా చిన్నతనంలో రాజమౌళి మైండ్‌లో ఉన్న ఆలోచనలని.. ఓ సందర్భంలో వివరించాడు. అయితే సావిత్రి గనుక బ్రతికి ఉంటే కచ్చితంగా ఆమెను ఓ పవర్ఫుల్ పాత్రలో పెట్టి సినిమా తీసి ఉండే వాడినంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.