ప్రస్తుత సమాజంలో ఎన్నో లైంగిక దాడులు, వేధింపులు సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం పాటు ఆ సంఘటనలు బాధితులను వెంటాడుతూనే ఉంటాయి. అయితే అలంటి ఘటనలు చాలా వరకు కోర్టులలో వాయిదాలు పడుతూ ఇప్పటికీ కొనసాగుతున్న కేసులు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు 7 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన చాలా వరకు తెలిసే ఉంటుంది. అయితే ఇలా లైంగిక వేధింపులు జరిగినది ఒక సాధారణ స్త్రీకి కాదు.. ఆమె ఓ స్టార్ సెలబ్రిటీ. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, మళయాళ ఇండస్ట్రీలోను ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మను 2017లో కార్లో వెళుతున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు ఆమెపై లైంగికంగా దాడి చేసి హింసించారు. అప్పట్లో ఈ కేస్ సంచలనం సృష్టించింది.
ఇప్పటికీ ఆ సంఘటన సంచలనమే. మొదట ఇది జరిగిన సమయంలో మలయాళ ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. వెంటనే ఇండస్ట్రీ పెద్దలు స్టార్ సెలబ్రిటీ చాలామంది దీనిపై రియాక్ట్ అవుతూ బాధితురాలికి న్యాయం జరగాలని.. ఇలాంటి సంఘటనలు జరగనేకూడదంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అందరికీ దీనిపై క్లారిటీ వచ్చింది. ఇది ఆక్సిడెంట్లుగా జరగలేదట. చాలా ప్లాన్ ప్రకారమే చేశారని రివిల్ అయింది. ముఖ్యంగా కారులో ఉన్న డ్రైవర్‌ను బయటకు లాగి దాదాపు మూడు గంటల పాటు హింసించారట. బాధితురాలు త్రిసూర్ నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్న టైంలో.. నైట్ టైం ఆమె కారును వ్యాన్‌తో ఢీ కొట్టి తర్వాత డ్రైవర్లు లాగి.. బలవంతంగా కారులోకి వెళ్లి కార్ ఆపకుండా డ్రైవ్ చేస్తూ సుమారు మూడు గంటల పాటు ఏడుగురు లైంగిక దాడులు చేశారు.
అదే సమయంలో వీడియోలు, ఫోటోలు తీసిన దుండగులు చివరకు కొచ్చిలో ఓ ప్రాంతంలో ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఇక అప్పట్లో మలయాళ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఆమెకు ఇలాంటి సంఘటన జరగడం అభిమానులు కాదు.. ఇండస్ట్రీ వ్యక్తులు కూడా షాక్ అయ్యారు. అయితే ఆ వ్యక్తులను గుర్తుపట్టడానికి బాధితురాలు ఎంత ప్రయత్నించినా.. ముఖానికి ముసుగులు కట్టుకోవడంతో అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఓ వ్యక్తిని గుర్తుపట్టిందట. అయితే.. అతనికి మలయాళ ఇండస్ట్రీలో చాలా పెద్ద సర్కిల్ ఉందట. ఎంతోమంది సెలబ్రిటీలకు, డ్రైవర్లను సప్లై చేస్తాడని తను కూడా ఒక డ్రైవర్ అని తెలిసింది. ఈ క్రమంలోనే డ్రైవర్ నుంచి అసలు వ్యక్తి ఎవరు అనేది తెలుసుకొని అంత ఆశ్చర్యపోయారు. ఎవరైతే ఆమెకు సపోర్ట్ గా మాట్లాడారు.. ఆ వ్యక్తి ఈ కేసులో కీలకంగా ఉండడం అందరికీ షాక్‌ను కలిగించింది.
ఇక ఈ సంఘటన జరిగేటప్పుడు మొహం కనిపించేలా ఆమెను వీడియో తీయండి అని కూడా ఆ వ్యక్తి చెప్పాడట. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొద్ది నెలల తర్వాత అతను రిలీజై బయటకు కూడా వచ్చేసాడు. ఆ సమయంలో ఎమోషనల్ అయినా ఆ హీరోయిన్.. భావోద్వేగానికి గురై సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళగక్కింది. నా తప్పు లేకున్నా.. నన్ను మౌనంగా ఉంచడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ.. నా గొంతు సజీవంగా ఉండడానికి కూడా నాకు సపోర్ట్ గా చాలా మంది నిలిచారు. ఇప్పటికే న్యాయం కోసం పోరాడుతున్నా. నేను ఒంటరి కాదని.. నాకు తెలుసు.
న్యాయం కవాలని.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. నాలా మరెవరికి పరిస్థితులు రాకూడదనే.. ఉద్దేశంతో నేను నా ప్రయాణం కొనసాగిస్తా.. నాకు మద్దతుగా నిలబడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఓ స్టార్ హోదాలో ఉన్నప్పటికీ.. న్యాయం కోసం ఇంతలా బాధపడుతున్న.. ఇప్పటివరకు ఆమెకు సరైన న్యాయం జరగలేదు. ఇప్పటికీ అదే కేసు నడుస్తూనే ఉంది. అయితే ఆమె తన చేదు జ్ఞాపకాలు పక్కనపెట్టి.. ప్రస్తుతం తన కెరీర్‌ను ధైర్యంగా ముందుకు కొనసాగుతుంది.