టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్‌తో ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సుక్కు.. తన సినిమాలో హీరోకు తగ్గ హీరోయిన్ సెలెక్ట్ చేయడంలో మంచి సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సుకుమార్.. రామ్ చరణ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమా కంటే ముందు వీరిద్దరి కాంబోలో రంగస్థలం తెరకెక్కి నాన్ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి.
కాగా ఈ సినిమాను కూడా రంగస్థలం మాదిరి మట్టి వాసన చూపిస్తూ.. నాచురల్ గానే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. కాగా.. ఇది నిజజీవిత సంఘటన ఆధారంగా రూపొందనుందని టాక్. ఇక ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడట. ఈ క్రమంలోనే చరణ్ కోసం సుకుమార్ ఇద్దరు కత్తిలాంటి ఫిగర్లను సెట్ చేశాడంటూ టాక్ నడుస్తుంది. వారిలో ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన. సుకుమార్ గత సినిమా పుష్ప సీరిస్‌లలో రష్మిక న్యాచురల్ నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమాలోను చరణ్ పక్కన.. అలాంటి నాచురల్ పల్లెటూరి అమ్మాయి పర్ఫామెన్స్‌కు రష్మిక అయితే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలరని రష్మికను చూజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటే.. మరో హాట్ బ్యూటీని కూడా సుక్కు.. చరణ్ కోసం రంగంలోకి దించనున్నాడట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అని టాక్. గతంలోనే ప్రభాస్‌కు జంటగా సాహో సినిమాలో మెరిసిన శ్రద్ధ.. ఈ సినిమాల్లో తన హాట్ నెస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఈ క్రమంలోనే చరణ్‌తోను అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి.