టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ తాజాగా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఎన్టీఆర్31 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు.. టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న ఓ టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేసేసారని టాక్ గట్టిగా నడుస్తుంది. ఇక ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ మేకర్స్ పరిశీలిస్తున్నారంటూ మొదటి నుంచి టాక్ నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ను అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందట. దీనికి సంబంధించిన పెద్ద హింట్ కూడా వచ్చేసిందంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే.. తాజాగా కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమాను డ్రాగన్ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు అక్కడ మంచి టాక్ రావడంతో.. తెలుగులోనూ ఈ సినిమాను టైటిల్ మార్చి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్.. పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – నీల్ సినిమాకు.. డ్రాగన్ టైటిల్ తెలుగులో ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఉంటారు.. అందుకే ఆ సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారంటూ టాక్ నడుస్తుంది. ఇక నిన్న మొదలైన ఈ సినిమా షూటింగ్ స్పెషల్ సెట్‌కు సంబంధించిన ఓ స్టిల్ కూడా నీల్ షేర్ చేసుకోగా అది క్షణాల్లో వైరల్ గా మారింది. 1964 వింటేజ్ కోల్కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. దీనికి తగ్గట్టుగానే స్పెషల్ సెట్ కూడా రెడీ చేశారు.
ఇక ఎన్టీఆర్ ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ నుంచి సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నాడు. పిరియాడికల్ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ డ్రాగన్ మూవీలో.. మలయాళ హీరో టోవినో థామస్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వార్ 2 పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. త్వరలోనే ఈ షూట్ ను పూర్తి చేసి.. డ్రాగన్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడట. ఇక వార్ 2లోనూ నాటు నాటు తరహాలో ఓ పాట ప్లాన్ చేస్తున్నారని.. ఈ సాంగ్ షూట్ మొత్తం అయిపోతే.. ఇక వార్ 2 కు కొబ్బరికాయ కొట్టేసి.. నీల్ మూవీతో బిజీ కావచ్చని యంగ్ టైగర్ భావిస్తున్నట్లు సమాచారం.