టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నా.. దర్శకధీరుడు రాజమౌళికి ఓ సపరేట్ క్రేజ్ ఉంది. దాదాపు స్టార్ హీరోల రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జక్కన్న.. తాను తీసిన ప్రతి సినిమాతోను బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రతి సినిమాతోను ఏదో ఒక వైదిద్యతను చూపిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ సినీ లవర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జక్కన్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు రాజమౌళి.
కాగా ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్లో తన సత్తా చాట్ ఎందుకు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. ఇక రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఎప్పుడు లేని లెవెల్లో భారీ సక్సెస్ అందుకుంది. అంతేకాదు.. రవితేజను ఈ మూవీలో ఎప్పుడు లేని డిఫరెంట్ యాంగిల్ లో జక్కన చూపించడం సినిమాకు హైలెట్ అయింది. ఈ సినిమాల్లో రవితేజ డ్యూయెల్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఓ పక్క సీరియస్ మోడ్‌లో నటిస్తూనే.. మరో పక్కన తనలోని కామెడీ యాంగిల్ చూపిస్తూ.. రెండు క్యారెక్టర్‌లను ఒక్క సినిమాల్లో పోషించి తన నటనకు ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.
అయితే రాజమౌళి మేకింగ్‌తో ఈ సినిమా వేరే లెవెల్‌కి వెళ్ళింది. కానీ.. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న క్రమంలో.. ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపించాల్సిన సందర్భాలు ఉండేవి. అలాంటి క్రమంలో రవితేజకు డూప్‌గా.. స్వయంగా రవితేజ తమ్ముడు భరత్ నటించాఉ. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. రవితేజ, భరత్ ఇద్దరు ఒకేలా ఉంటారు. కనుక కొన్ని షాట్స్ లో ఆయనను వాడినట్లు సమాచారం. అయితే భరత్ గత కొన్ని సంవత్సరాల క్రితం.. కార్ యాక్సిడెంట్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విక్రమార్కుడు సినిమా రవితేజ డూప్‌గా భరత్ నటించాడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.