టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా. ఇప్పటివరకు ఆయన తీసింది రెండు సినిమాలే అయినా.. ఆ రెండు సినిమాలతోనూ సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకొని ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. అంతే కాదు.. తన సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఎంతోమంది స్టార్ హీరోలు సైతం సిద్ధంగా ఉన్నారు. ఇక సందీప్‌రెడ్డి వంగ.. ఇండస్ట్రీలోనే ఓ యునిక్ డైరెక్టర్. ఆయనలా కుండబద్దలు కొట్టినట్లు ఇంటర్వ్యూలలో మాట్లాడడం.. స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడం.. మరి ఎవరికి సాధ్యం కాదు. ఇక అదే వైవిధ్యతను సినిమాలలో కూడా చూపిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న సందీప్.. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి.. ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇండస్ట్రియల్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. వీరిద్దరు కాంబోలో రాబోతున్న.. సినిమాపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో తలపడేందుకు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలను.. విలన్స్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట సందీప్.
అందులో ఒకరు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన విశాల్.. మరొకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గోపీచంద్ అని.. వీళ్ళిద్దరినీ ప్రభాస్ తో తలపడే స్ట్రాంగ్ విలన్స్ గా సినిమాలో చూపించేందుకు సందీప్ రెడ్డివంగా సన్నాహాలు చేస్తున్నాడని టాక్. ఇక గోపీచంద్ , ప్రభాస్ మొదటి నుంచి మంచి స్నేహితులు. దీంతో గోపీచంద్ కూడా ప్రభాస్ సినిమాలో విలన్‌గా నటించేందుకు నో చెప్పే అవకాశం లేదు. గతంలోనూ వీరిద్దరూ హీరో, విలన్‌గా వర్షం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ క్రమంలో నిజంగా వీరిద్దరూ కలిసి మళ్ళీ నటిస్తే మాత్రం ఆ సినిమాపై ఆడియన్స్ లో మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.