ఆ పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ద‌గ్గ‌ర‌కు త్రివిక్రమ్ తనయుడు.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలుగులో స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు రిషి మనోజ్‌ను కూడా డైరెక్టర్‌గా తీర్చి దిద్దేందుకు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు. ఇందులో భాగంగానే రిషి మనోజ్ త్వ‌ర‌లో మెగా ఫోన్ పట్ట‌నున్నాడు. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ కొడుకుకి శిక్షణ ఇచ్చే బాధ్యతలు ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కు అప్పచెప్పాడు. ఇప్పటికే రిషి ట్రైన్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఓ పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ సినిమాకు ఆయన వివరించబోతున్నాడు.

Trivikram Son as Director : త్రివిక్రమ్ కొడుకు ఎప్పుడైనా చూసారా.. డైరెక్టర్  మన ముందుకు రాబోతున్నాడు..

జెస్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్స‌నూరి వద్ద.. త్రివిక్రమ్ కొడుకు ఇప్పటికే శిక్షణ తీసుకోగా.. విజయ్ – గౌతమ్‌ తిన్న‌నూరి కింగ్‌డ‌మ్ సినిమాకు కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. దాదాపు ఈ ప్రాజెక్టు పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలోనే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయనున్నాడు. ఇక్కడ.. త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కొడుకుని అసిస్టెంట్గా తీసుకోవాలని అడిగాడని.. అందుకే ప్రభాస్ స్పిరిట్‌ సినిమాకు రిషి అసిస్టెంట్ గా పని చేయబోతున్నాడని సమాచారం.

Trivikram's Son Works Under Sandeep Vanga

ఇక ఈ ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత.. రిషి కూడా డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట. మరో రెండేళ్లలో పవన్ తనయుడు అకిరా నందన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనట్లు గట్టి టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే పవన్ వారసుడు అకీరా డబ్యూ సినిమాకు.. త్రివిక్రమ్ వారసుడు రిషి డైరెక్టర్‌గా వ్యవహరించింది. ఇక పవన్, త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరు వారసుల డబ్యూ మూవీ పట్టాలికే అవకాశం చాలా వరకు ఉంది.