నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ పేరు చెప్తే ఒకప్పుడు కోపిష్టి, షార్ట్ టెంపర్ ఇలా రకరకాలుగా కామెంట్లు వినిపించేవి. కానీ బాలకృష్ణ సన్నిహితులు మాత్రం ఆయన మనసు వెన్న, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం, స్వచ్ఛంగా మాట్లాడుతారు అని చెబుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఆయన హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో తర్వాత.. ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కాగా ఓ సినిమా సెట్‌లో మాత్రం.. నిజంగానే బాలకృష్ణ హీరోయిన్‌ను ఏడిపించాడని.. బై మిస్టేక్ ఆమె కాలు తొక్కినందుకు సెట్స్‌లో పెద్ద రచ్చ చేసి.. సారీ చెబుతున్నా వినకుండా నాన్నాహైరానా చేశాడని.. ప్యాకప్ చెప్పి హీరోయిన్ ని కూడా బెదిరించాడని.. దీంతో ఆమె చేసేదేమీ లేక అందరి ముందే కన్నీళ్లు పెట్టుకుందని టాక్ తెగ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లయ. కామెడీ సినిమాలతో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు.. చాలా సెలెక్టీవ్ సినిమాల్లో మాత్రమే నటించి మెప్పించింది. హోమ్లీ బ్యూటీగా గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ.. హుందాతనంతో మెరిసింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కాకుండా.. జగపతిబాబు, శివాజీ, రాజేంద్రప్రసాద్ లాంటి వారితోను కామెడీ సినిమాల్లో మెరిసింది. అయితే.. ఈమె సీనియర్ స్టార్ హీరోగా ప్రస్తుతం మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న బాలయ్యతో విజయేంద్రవర్మ అనే సినిమాలో జంటగా మెరిసింది. ఈ సినిమాలో ఓ సాంగ్‌లో బాలయ్యతో కలిసి నటించిన లయ.. పాట షూట్ జరుగుతున్న క్రమంలో డ్యాన్స్ మూవ్మెంట్ అయిపోవడం.. నెక్స్ట్ బాలయ్యతో చేయాలని ఆయన ఎక్కడ ఉన్నారో వెతుకుతూ వెనక్కి కాలు వేసిందట.
అయితే.. ఆమె వెనకాలే బాలకృష్ణ ఉన్నారు. అది చూసుకోకుండా.. లయ కాస్త గట్టిగానే కాలిని తొక్కేసిందట. దీంతో.. వెంటనే బాలకృష్ణ గట్టిగా అరిచి సెట్స్‌లో అందరి ముందే రచ్చ చేశాడట. నా కాలు తొక్కేస్తావా అంటూ రచ్చ చేశాడట. ఈ క్రమంలో లయ తన వల్లే షూట్‌కు ప్యాకప్ చెప్పేస్తున్నారని.. బాలయ్య సీరియస్ అయ్యడని.. చూసి సారీ సార్, సారీ.. సారీ.. అంటూ ఎంతగానో బతిమిలాడుకుందట. అందరి ముందే సెట్స్‌లో ఏడ్చేసిందట. అయితే కొంతసేపటికి బాలయ్య నేను ఊరికే అన్నా.. నిజం కాదు కాసేపు ఆటపటిదామని అలా చేశా అంటూ కూల్ గా కామెంట్ చేసాడట. దీంతో ఊపిరి పీల్చుకున్న లయ.. కాసేపు వనికిపోయానని.. అందరి ముందు బాలకృష్ణ గారు అలా అనేసరికి తట్టుకోలేకపోయానని.. ఓ ఇంటర్వ్యూలో వివరించింది. అయితే అది నాకు బాలకృష్ణ గారితో బెస్ట్ మెమోరీ అని.. ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బాలయ్య చిన్నపిల్లల మనస్తత్వం గురించి చెప్తూ లయ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.