టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగతి తెలిసిందే. అరుడజనులకు పైగా హీరోలను తన కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మాత్రం మెగా డాక్టర్ నిహారిక మాత్రమే. నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు స్టార్టింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసి తను నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా హీరోయిన్గా మారి ఆడియన్స్ పలకరించింది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన.. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డా.. సినిమా మాత్రం పెద్దగా క్లిక్ కాలేదు.
అయినా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆ సినిమాలేవి సరిగ్గా సక్సెస్ కాకపోవడంతో.. కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగులేసి.. అక్కడ సక్సెస్ సాధిస్తుంది. ఇదిలా ఉంటే నిహారిక పర్సనల్ లైఫ్ లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదించిన ఈ వివాహం ఎంతో కాలం నిలవలేదు. ఇద్దరు 2023లో డివోర్స్ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వీరి విడాకుల తర్వాత కెరీర్‌పై ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. పలు సినిమాలను నిర్మిస్తూ.. అడపా దడపా సినిమాలో నటిస్తూ రాణిస్తోంది. ఈ క్రమంలోనే అమ్మడి రెండో పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ హీరోని వివాహం చేసుకోబోతుంది.. ప్రొడ్యూసర్ కొడుకుని పెళ్లాడబోతుందంటూ.. ఏవేవో వార్తలు వినిపించాయి.
ఇలాంటి క్రమంలో ఆమె స్వయంగా ప్రేమలో పడ్డానంటూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారుతుంది. ఇంతకి నిహారిక ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. ఓ బుడ్డోడుతో. అవును తన బెస్ట్ ఫ్రెండ్ అంబటి భార్గవి కొడుకు నిహారిక కోసం రాసిన ఓ లెటర్.. సోషల్ మీడియాలో అమ్మడు షేర్ చేసుకుంటూ.. దానికి మైనర్ పాస్‌పోర్ట్ నోట్ బుక్.. నేను అతడిని ప్రేమిస్తున్న.. @అంబటి భార్గవి అంటూ ట్యాగ్ చేసి.. మా ఫ్రెండ్ షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు.. ఓకేనా థాంక్స్ అంటూ ఆ నోట్లో రాసింది నిహారిక. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కాగా తాజాగా నిహారిక తన సొంత బ్యానర్ పై కమిటీ కుర్రాళ్ళు సినిమాను తెరకెక్కించి నిర్మాతగా బ్లాక్ బస్టర్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున ఈ అమ్మడు.. ప్రస్తుతం తన చిన్న ఫ్రెండ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.