డైరెక్టర్ ప్రశాంత్ కేజిఎఫ్ సినిమా తర్వాత పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయనతో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు నిర్మాతలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ 2 కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ మరో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సరికొత్త ప్రాజెక్టును మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో ప్రశాంత్ నీల్.. భారీ సీన్స్ మొదలు పెట్టాడు. ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ కావడానికి మరి కాస్త సమయం పడుతుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఎన్నో పుకార్లు వైరల్ గా మారాయి. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు నేపథ్యంలో ఎన్టీఆర్, నీల్ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. నల్లమందు అంశాలతో పీరియాడికల్ నేపథ్యంలో భారీ యాక్షన్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందట. తాజాగా.. ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి సినిమా షూట్ నేపథ్యంలో ఊర మాస్ ఎలివేషన్స్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌షేర్ చేసుకుంది.
ప్రశాంత్ నీల్ మైక్ పట్టుకుని షార్ట్ చెప్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ.. అతడు మైక్ పట్టుకుంటే ఆ తర్వాత జరిగేది ఒక చరిత్ర అంటూ ఎలివేట్ చేసింది. డెడ్లీయస్ట్ షో ప్రారంభమైంది.. విధ్వంసానికి అడ్డా అయిన ప్రాంతానికి సుస్వాగతం అంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానంటూ.. తారక్ పై ఆమె మరింత హైప్ ఇచ్చింది. చూస్తుంటే లిఖిత రెడ్డికి తారక్ అంటే ఎంత అభిమానమో అర్థమవుతుంది. ఇక తరచు సోషల్ మీడియాలో ఆమె తారక్ తో ఉన్న పోస్టులను షేర్ చేస్తూ తన అభిమానాని చాటుతుంది. ఇక లికిత, ప్రశాంత్ నీల్‌ది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.