మళయాళ స్టార్ట్ హీరో ఉన్ని ముకుందన్.. తాజాగా మార్క్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. మళయాళ ఇండస్ట్రీ నుంచి ఓ ఏ.. సర్టిఫికెట్ సినిమా వచ్చి ఏకంగా రూ.100 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. మార్క్ సినిమాలోని యాక్షన్ సీన్స్ మరో కేజీఎఫ్, సల్లార్‌ను తలపించేలా ఉన్నాయని కామెంట్‌లు వినిపించాయి. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న ఉన్ని ముక్కుందన్.. మార్క్‌తో ఎట్టకేలకు తన రేంజ్‌కు తగ్గ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఎలాంటి యాక్షన్ సీన్స్ అయినా అలవోకగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకునే ముకుందన్.. రొమాంటిక్ సీన్స్‌కు మాత్రం ఎప్పటికప్పుడు దూరంగానే ఉంటాడు.
తన సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి.. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, ఇంటిమెంట్ సీన్స్ లో ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదు. ఆయన నటించేది హీరో రోల్ అయినా.. విలన్ పాత్ర అయినా.. ఇంటిమేట్ సీన్స్‌కు మాత్రం ఎప్పటికప్పుడు దూరంగానే ఉంటూవచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం రియాక్ట్ అయ్యారు. కెరీర్ ప్రారంభం నుంచి తను అలాంటి సన్నివేశాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని.. సినిమాల్లో అడుగుపెట్టే టైంలో ఇలాంటి నిర్ణయంతో పలు ఆఫర్లు వచ్చిన.. నా నిర్ణయంతో ఎంత ఇబ్బందులు ఎదురైనా.. డెసిషన్ మాత్రం మార్చుకోలేదని.. ఎప్పుడో కిస్సింగ్ సీన్లు రొమాంటిక్ సీన్స్ లో నటించలేదని వెల్లడించాడు.
ఆ సీన్స్ కోసం కొన్నిసార్లు కొంతమంది ఒత్తిడి చేసే వాళ్ళని.. నేను మాత్రం ఎప్పుడు నిర్ణయం మార్చుకోలేదు అంటూ వివరించాడు. ఇక సినిమాల్లో లవర్స్, భార్యా – భర్తల మధ్యన ప్రేమను చూపించడానికి రొమాన్స్, కిస్ సీన్స్ మాత్రమే మార్గం కాదని.. అందుకే నేను అలాంటి సీన్స్ ను వ్యతిరేకిస్తానంటూ చెప్పడంతో కొన్ని ఆఫర్లు కూడా వెళ్లిపోయాయని.. ఆయన వివరించాడు. ఇతర హీరోలు చేస్తున్న దాన్ని నేను తప్పు పట్టడం లేదని.. నా పద్ధతిలో నేను వెళ్తా నేను తీసుకున్న డెసిషన్‌కు కట్టుబడే ఉంటా అంటూ వివరించాడు. భవిష్యత్తులో తను నటించబోయే సినిమాల్లో కూడా అలాంటి ఇంటిమేట్ సీన్స్ కానీ ఉండవని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఉన్ని ముక్కుందన్ టాలీవుడ్ లో సమంతతో కలిసి.. శాకుంతలం సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే.