మీడియాలో అల్లు అర్జున్ మాస్ హిస్టీరియా ..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఒకటే ఇంట్రెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ కేస్‌. సంధ్య థియేటర్ ఘ‌ట‌న‌, మహిళా మృతి, ఆమె కొడుకు ఆసుపత్రి పాలవడం, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, టాలీవుడ్ పరామర్శ, రేవంత్ రెడ్డి రియాక్షన్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్, తర్వాత పోలీసుల ప్రెస్‌మీట్‌, ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్‌ను విచారణకు పిలవడం.. ఇవన్నీ హాట్ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ టాపిక్ ముందు.. మిగతా వార్తలని చిన్నబోతున్నాయి.

Allu Arjun's 18-hour ordeal: Arrest, bail, night on prison floor | Latest  News India - Hindustan Times

పుష్ప 2 సక్సెస్‌కు కూడా.. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం లేదంటే.. మిగతా సినిమాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే సంక్రాంతి సినిమాల హంగామా మొదలవ్వాల్సింది. అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగ‌తి తెలిసిందే. ఇది ఇప్పటికే తెలుగు మీడియాలో ఫుల్ కవరేజ్ అయిపోయి ఉండాల్సింది. కానీ.. అదే టైం కు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది. ఇక.. తాజాగా బాలయ్య డాకు మహారాజ్ ప్రెస్ మీట్ వద్ద కూడా ఈ సంధ్య థియేటర్ ఇష్యూ, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల‌పై మాత్రమే ఆసక్తి కాన్వర్జేషన్ జరిగింది.

గతవారం రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం రిలీజైన సినిమాలపై కూడా ఆడియన్స్ లో ఆసక్తి లేదు. ఇక రాబిన్హుడ్ సినిమాను వాయిదా వేసి మైత్రి మేకర్స్ మంచి డెసిషన్ తీసుకున్నారు. రెగ్యులర్ అప్డేట్స్ పై కూడా ఫాన్స్ ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితి. చైతన్య తండేల్‌ సినిమా నుంచి శివశక్తి సాంగ్ రిలీజ్ చేయాలని అనుకున్నా అది అల్లు అరవింద్ ప్రొడెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఆటపాటలకు ఇది సమయం కాదని.. సాంగ్ రిలీజ్ కూడా వాయిదా వేశారు. మొత్తానికి ఇప్పుడు మీడియా మొత్తంలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ టాపిక్ మాస్ట్ హిస్టీరియా నడుస్తుంది.