టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించాలని ఎంతోమంది అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ వారసుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చరణ్.. తన సొంత టాలెంట్ తో గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే చరణ్ తను అనుకున్నట్టుగా ఈ సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ సాధిస్తాడా.. లేదా ఓ మోస్తారు సక్సెస్ తో సరిపెట్టుకుంటాడా వేచి చూడాలి. ఇక శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకి హైలెట్గా నిలవనున్నాయని టాక్. ఇంటర్వెల్ సీన్కు ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఆర్‌ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ లో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి చరణ్ ఎంతో ఆరాటపడుతున్నారు.
ఈ క్రమంలోనే తన ప్రతి కథతో ఆడియన్స్ మెప్పించేలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్ చూసిన సుకుమార్ ఈ సినిమాల్లో చరణ్ నటనకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇక గేమ్ ఛేంజర్‌లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆడియన్స్ ని మూవీ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.