నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సెక్సస్‌తో ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతెల, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా.. సితార, ఫార్చ్యూన్‌ఫోర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీతో పాటు.. త్రివిక్రమ్ భార్యా సాయి సౌజన్య ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. కాగా డాకు మహారాజ్ సినిమాలో.. అఖండ పోలికలు ఉన్నాయంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ మేటర్ ఏంటంటే అఖండలో చైల్డ్ సెంటిమెంట్, కలెక్టర్ రో లాంటి అంశాలు డాకు మహరాజ్‌లో కూడా కనిపించనున్నాయట. అఖండలో బాలయ్య అఘోర, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పాత్రలో డ్యూయల్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ ఆడియన్స్‌ను మెప్పించాయి. అంతేకాదు.. అఖండలో చైల్డ్ సెంటిమెంట్ హైలెట్ చేశారు. ఇప్పుడు డాకు మహారాజ్‌లో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించకున్న డబల్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాల్లో కి ఎపిసోడ్‌లో డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా ఆయన దర్శనం ఇవ్వనున్నాడట.
అలాగే చైల్డ్ సెంటిమెంట్ సినిమాలో హైలెట్ కానుందని సమాచారం. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గాను అఖండ బ్యూటీ ప్రజ్ఞ జశ్వాలు కనిపించనుంది. ఇక జనవరి 2న డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు నిర్మాత నాగవంశీ వెల్లడించాడు. జనవరి 4న అమెరికా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే ఓ సాంగ్ లంచ్ కూడా చేస్తామని, జనవరి 8న ఆంధ్రాలో ఈవెంట్ ఉంటుందని.. విజయవాడ లేదా మంగళగిరిలో ఉండవచ్చు అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్యను చివరి 20, 30 ఏళ్లలో ఇలాంటి విజువల్స్ లో అసలు చూసి ఉండరని.. తాను బ్యాగ్రౌండ్స్ కోర్స్‌తో పాటు.. ఈ మూవీ చూసానని.. చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మకం ఉందంటూ వెల్లడించాడు.