సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు.. హీరోయిన్లుగా ఎదగాలంటే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారైనా హిట్ పడితే చాలు.. హీరోయిన్లకు స్టార్ హీరోయిన్గా ఇమేజ్ వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో సౌత్ స్టార్ హీరోయిన్ గానే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుని కుర్రకారు నేషనల్ క్రష్‌గా మారిపోయింది.
రష్మిక మందన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, హిందీ , మలయాళ భాషల్లో నటిస్తూ వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా సెటిల్ అయ్యి టాప్ హీరోయిన్ పొజిషన్ దక్కించుకుంది. ఇక అమ్మడి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఈవెన్ మూవీ ఏదైనా ఉందంటే అది పుష్ప అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పుష్ప సక్సెస్ తో రష్మిక భారీ స్టార్ డంను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్ గా పుష్ప పార్ట్ 2 షూట్ లో సందడి చేసింది. తాజాగా సినిమా షూట్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న సినిమా తెరపైకి రానుంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్, డబ్బింగ్ ఇతర కార్యక్రమాలన్నీ పూర్తయిన నేపథ్యంలో.. రష్మిక ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకుంది.
ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ని పెడుతూ.. తన ఏడేళ్ల కెరీర్‌లో ఒక్క పుష్ప సినిమా జర్నీనే మొత్తం ఐదేళ్లు ఉందంటూ వెల్లడించింది. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఓ రకంగా పుష్ప జర్నీ నాకు ఒక ఇల్లుగా మారిపోయింది అంటూ వెల్లడించింది. ఈ సినిమా తనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎంతో మిస్ చేస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చింది. నా హృదయం ముక్కలైనట్లు అనిపిస్తుంది అంటూ పోస్ట్ ను షేర్ చేసుకుంది. ఐదేళ్లలో చాలా పని చేసామని.. కొంచెం బ్యాలెన్స్ ఉందంటూ పనిలో పనిగా పుష్ప పార్ట్ 3 పై కూడా ఆమె ఇన్ డైరెక్ట్ హిట్ ఇచ్చింది. ఇక బన్నీ సార్, సుకుమార్ సార్ సినిమా షూట్ లో మరింత క్లోజ్ అయ్యారంటూ వెల్లడించింది. ఐదేళ్ల పుష్ప ప్రయాణంలో నాకు ఇల్లు అయిపోయింది. ఇప్పుడు దీన్ని విడిచి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.