నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా, బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందునున్న ఈ సినిమా బాలయ్య 110వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసే లెవెల్ లో కంటెంట్ను క్రియేట్ చేశారట మేకర్స్. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం వేడుకలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారట.
డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ పనులన్నీ పూర్తి చేసిన వెంటనే అఖండ 2 సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి లొకేషన్ లో వేటలో ఉన్న బోయపాటి.. కథకు తగ్గట్టు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశాలని, లొకేషన్‌లన్నీ చూస్తూ వస్తున్నాడట. ఆధ్యాత్మిక ప్రదేశాలు అంటే నార్త్, నేపాల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోయపాటి ఆ లొకేషన్ లో వేటలానే ఉన్నాడట. సినిమాల్లో మౌంట్ ఎవరెస్ట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు రూపొందించనున్నారని.. స్టోరీ రాసుకునే సమయంలోనే సన్నివేశాలు ఆ లొకేషన్స్ లో ఉంటే బాగుంటుందని అందుకు తగ్గట్టుగా మౌల్డ్ చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలయ్య మాస్ ఎంట్రీ ఎవరెస్టులో షూట్ చేయబోతున్నారట. ఆధ్యాత్మికతతో ఆ లొకేషన్లో బాలయ్య కనిపించనున్నారని సమాచారం.
అఖండలో చాలా సన్నివేశాలు ఆలయాల్లోనే తెరకెక్కించారు. అవసరం మేర సెట్స్ లోనే వీటిని రూపొందించారు. ఈసారి అందుకు భిన్నంగా అఘోరాలు తిరిగే హిమాలయ ప్రాంతాల నేపథ్యంలో బోయపాటి సినిమాను రూపొందించనున్నారని.. రియల్ లోకేషన్లో రియల్ ఎస్టేట్ పర్ఫామెన్స్ తో ఆడియోస్లో పలకరించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. ఇక అఖండలో అఘోర పాత్రలో కనిపించిన బాలయ్య.. ఈ పాత్ర లో తన నటనతో ఆడియోస్లో పిక్స్ లెవెల్లో ఆకట్టుకున్నాడు. పార్ట్ 2లో కూడా అఘోర 2.0 తప్పనిసరిగా ఉంటుంది. అయితే అంతకు మించిన రేంజ్లో సెకండ్ పార్ట్ లో ఆఘోర పాత్ర ఉండబోతుందని.. దానికోసమే బోయపాటి చాలా వర్కౌట్ చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఇలాంటి పాత్రలు వస్తే చెలరేగిపోతాడు అన్న సంగతి తెలిసిందే.