టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ నిర్మాత నవీన్ యార్నేని దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు నిజమేనంటూ చెప్పిన ఆయన.. రాబిన్‌హుడ్ మీడియా మీట్‌లో పుష్ప2 రన్ టైం పై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఇన్ డైరెక్ట్‌గా.. ఈ రన్ టైం అంగీకరించిన ఆయన.. ప్రేక్షకులకు ఎక్కడ ఇబ్బంది కలగదు రెండున్నర గంటల సినిమా చూసిన ఫీలే ఉండదంటూ వెల్లడించాడు. ఇక తాజాగా సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ అఫ్ అంత డ్రామా, ఎమోషన్‌తో కూడి ఉంటుందని.. మధ్యలో నుంచి యాక్షన్ తోడవుతుందని విశ్వసనీయ వర్గాల జమాచారం.
ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ రైజింగ్ యాక్షన్ తో ఫాన్స్ కు ఫుల్ మీల్‌లా ఉంటుందట. ఇక సినిమాకు నాలుగు బ్లాకులు అద్భుతంగా వచ్చాయని.. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే రికార్డ్ క్రియేట్ చేయడానికి ఇది చాలని మేకర్స్ తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్పా సినిమా చివరి పార్ట్ 3 అనౌన్స్మెంట్ కూడా ఉండనుందట. అయితే అది ఎప్పుడనే అంశంపై క్లారిటీ లేదు. కానీ పుష్ప 2 తర్వాత డైరెక్టర్ సుకుమార్, బన్నీ వేరే సినిమాలతో బిజీ కానన్నారు. పుష్ప 3 సెట్స్ మీదకి వస్తుందో లేదో పుష్ప 2 వచ్చే రెస్పాన్స్ పై ఆధారపడి ఉంటుందట.