మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అధితి.. దానికోసమేనా..?

సౌత్ స్టార్ హీరో, హీరోయిన్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అధితి రావ్‌ హైదారి, సిద్ధార్థ్‌ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట చాలా కాలం డేటిం్ త‌ర్వాత‌.. సైలెంట్ మ్యారేజ్‌తో ఫాన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి చేసుకుని నెటింట హాట్ టాపిక్ గా మారారు. సాధారణంగా ఎంతోమంది కపుల్స్ ఒకేసారి రెండు సాంప్రదాయాల్లో వివాహం చేసుకుంటూ ఉంటారు. హింధు – క్రిస్టియన్, లేదా హిందూ – ముస్లిం, క్రిస్టియన్ – ముస్లిం ఇలా రెండు సాంప్రదాయాల్లో వెంట వెంటనే పెళ్లిళ్లు జరుపుకుంటూ ఉంటారు.

Aditi Rao Hydari, Siddharth confirm marriage, see first wedding pics: 'Mrs  and Mr Adu-Siddhu' | Bollywood News - The Indian Express

కానీ.. సిద్ధార్థ్, అధితి మాత్రం రెండు సంప్రదాయాల్లో రెండు సార్లు వివాహం చేసుకొని వార్త‌లో నిలిచారు. సెప్టెంబర్‌లో పెళ్ళి చేసుకున్న ఈ జంట‌ ఆ ఫోటోలు స్వయంగా తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కాగా ఇప్పుడు ఈ జంట మరోసారి రాజస్థాన్ లో బిషన్ గ‌డ్ కోటలో వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోలను కూడా ఈ జంట తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ లో చేసుకున్న పెళ్లిలో సిద్ధార్థ్, అధితి సింపుల్ గా నార్త్ ఇండియన్ స్టైల్ లో మెరిసారు. అతిధి శారీలో.. సిద్ధార్థ లుంగి, షర్ట్ ధరించి సింపుల్గా కనిపించి ఆక‌ట్టుకున్నారు. అయితే సెప్టెంబర్ లో వనపర్తిలో 400 ఏళ్ల నాటి గుడిలో వివాహం చేసుకున్న ఈ జంట.. ఈసారి రాజస్థాన్‌లో 203 ఏళ్ల నాటి పురాతన కోటలో వివాహం చేసుకున్నారు.

అయితే రాజస్థాన్లో చేసుకున్న పెళ్లిలో మాత్రం.. రాజుల సంప్రదాయం ప్రకారం భారీ వస్త్రాలు, నగలు ధరించి రాయ‌ల్ లుక్‌లో మెరిశారు. డిజైనర్స్ సవ్యసాచి ముఖర్జీ ఈ దుస్తులను డిజైన్ చేశారు. తాము మరోసారి పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని ఈ జంట స్వయంగా వెల్లడించకపోయిన.. ఫోటోలను షేర్ చేశారు. అయితే ఫోటోషూట్ కోస‌మే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇందులో అతిధి మెడలో సిద్ధర్థ్‌ తాళి కడుతున్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ మొదటిసారి అతిథి కోసం వనపర్తిలో వివాహం చేసుకుంటే.. ఇప్పుడు సిద్ధార్థ కోసం రాజస్థాన్ కోటలో వివాహం చేసుకున్నారేమో.. సిద్ధార్థ్ ట్రెడిషన్ కోసం మరోసారి వేళ్ళ పెళ్లి జరుగుంటుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజ‌న్స్‌.