ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో హీరోయిన్ ఫిక్స్.. అసలు గెస్ చేయలేరు..?

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర స‌క్స‌స్‌తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. తార‌క్ ఈ సినిమా పూర్తి అయిన వెంట‌నే ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమాలో నటించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట‌ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ హిందీలో వార్ 2 సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. వెంటనే ప్రశాంత్ నీల్‌ మూవీ సెట్స్ లో సందడి చేయనున్నారట.

NTR - Prashant Neel Movie Titled Dragon?

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించినన్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెర‌కెక్క‌నున ఈ సినిమాకు ఇప్పటికే డ్రాగన్ టైటిల్ను ఖరారు చేశారు. అయితే అఫీషియల్ గా ప్రకటన రాకున్నా ప్రస్తుతం ఇదే టైటిల్ లో రన్నింగ్ టైటిల్ గా తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. వీరిద్దరు కాంబోలో రూపొందుతున్న సినిమాకు హీరోయిన్గా రుక్మిణి వసంత్‌ హీరోయిన్గా ఫిక్స్ అయిందంటూ టాక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై రుక్మిణి వసంత్ రియాక్ట్ అవుతూ.. ఆ మూవీ టీం నన్ను ఇప్పటివరకు సంప్రదించనేలేదని.. ఒకవేళ ఎన్టీఆర్ కు జోడిగా నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ప్ర‌శౄంత్ నీల్ కథ‌ అందించిన భఘీర మూవీ ప్రమోషన్స్ లో ఆమె చెప్పుకొచ్చింది.

NTR-Prashant Neel Movie: Rukmini Vasanth to Play Lead Role?

ఈ భఘీర మూవీలో శ్రీముర‌ళి జోడిగా ఆమె నటించి ఆకట్టుకుంది. ఈ క్ర‌మంలోనే సినిమా సక్సెస్ అందుకోలేక‌పోయింది. ఇకపోతే తాజాగా.. మరోసారి రుక్మిణి వసంత్‌ సినిమాలో హీరోయిన్గా నటించబోతుందంటూ ప్రశాంత్ నీల్‌.. ఎన్టీఆర్ కోసం ఆమెను ఫిక్స్ చేసేసారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆల్మోస్ట్.. ఆమె హీరోయిన్ గా కన్ఫార్మ్ అయిపోయిందట. దానికోసం.. ఆమె బల్క్ కాల్ షీట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక తారక్‌తో ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మరో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయకూడదని మేకర్స్ అగ్రిమెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలకు మాత్రం చేసుకునే పర్మిషన్ అమ్మడుకు ఇచ్చారట మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నడివి చాలా తక్కువగా ఉంటుందని.. స‌లార్‌.. శృతిహాసన్ పాత్ర తరహాలోనే డ్రాగన్ లో రుక్మిణి వసంత్‌ పాత్ర కూడా చాలా లిమిటెడ్ గా కనిపిస్తుందని అంటున్నారు.