బాలయ్యతో 17 సినిమాల్లో రొమాన్స్.. భార్యగా నటిస్తూ అన్న అని పిలిచిన్న స్టార్ హీరోయిన్.. !

వెండితెరపై కొంతమంది హీరో, హీరోయిన్లు జంటగా కనిపిస్తే ఆడియన్స్ కు కన్నుల పండగలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి హిట్ పేయిర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు చాలా సినిమాల్లో కలిసిన నటిస్తూ తమ ఇమేజ్‌మరింతగా పెంచుకుంటూ ఉంటారు. అలా బాలకృష్ణ తన కెరీర్‌లో ఓ స్టార్ హీరోయిన్ తో ఏకంగా 17 సినిమాల్లో రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీరిద్దరిది ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ పెయిర్ అన్నే మంచి ఇమేజ్ కూడా దక్కించుకున్నారు. అయితే ఈ హీరోయిన్ బాలయ్యతో పాటు.. చిరంజీవితో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక భార్యగా బాలయ్యతో సినిమా చేస్తున్న సమయంలోనే.. రాఖీ పౌర్ణమి రావడంతో బాలయ్య కు రాఖీ కట్టి అన్న అని పిలిచి సర్ప్రైజ్ చేసిందట.

Ikkade Ilage Full Video Song || Pattabhishekam Movie || Balakrishna,  Vijayashanti - YouTube

ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు..? ఒకసారి తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్‌ విజయశాంతి. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఈ అమ్మడు.. బాలకృష్ణ తో మొదటిసారి 1984లో కథానాయకుడు సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత దాదాపు 17 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించి సక్సెస్ఫుల్ కాంబోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక 1987లో వీరి కాంబోలో తెరకెక్కిన భానుమతి గారి మొగుడు సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. ఇది వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన తొమ్మిదవ సినిమా. ఈ మూవీ షూట్‌ టైంలో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగిందట. బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ అంటే బ్లాస్టర్ కాంబో వీరిద్దరి కెమిస్ట్రీని కూడా ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు.

Bhanumati gari Mogudu (1987) - IMDb

అయితే ఈ సినిమా షూట్ టైంలో రాఖీ పౌర్ణమి వచ్చిందట. విజయశాంతి రాఖీలను తీసుకువచ్చి బాలయ్యకు కట్టి అన్న అని పిలుస్తూ సర్ప్రైజ్ చేసిందట. ఈ విషయాన్ని విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో విజయశాంతి బాలయ్యకు భార్యగా నటిస్తోంది. ఓవైపు భార్యగా చేస్తూనే.. ఆఫ్ స్క్రీన్‌ చెల్లెలుగా రాఖీ కట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించిందట. ఇక విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెబుతూ.. బాలయ్య నేను ఎన్ని సినిమాల్లో కలిసి నటించినా.. ఆయన నాకు మంచి బ్రదర్ లాంటివారు. రియల్ లైఫ్ లోను పర్సనల్ విషయాలను అన్నాచెల్లెళ్లలా షేర్ చేసుకుంటాం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది విజయశాంతి. అయితే బాలయ్యను మంచి అన్నగా విజయశాంతి భావించడం తప్పులేదు. కానీ.. ఏకంగా 17 సినిమాల్లో వీరిద్దరి రొమాన్స్ చూసినా ఆడియన్స్ విజయశాంతి అన్న అని పిలుస్తూ రాఖీ కట్టడంతోఎ ఆశ్చర్యపోయారట.