అత‌డిని ఎన్టీఆర్ నుంచి దూరం చేస్తోందెవ‌రు… తార‌క్ కోపానికి కార‌ణం ఇదే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన‌ మూవీ దేవర బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ ను మేకర్స్‌ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ నెటింట‌ సంచలనంగా మారాయి. ఎవరు ఏమన్నా.. ఏమనుకున్నా.. కొసరాజు హరికృష్ణ తనకు ఎంతో ముఖ్యమని తారక్ చెప్పకనే చెప్పారు. అయితే తార‌క్ అలా చెప్పడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది కొసరాజు హరికృష్ణ గురించి తప్పుగా కామెంట్ చేయడం వల్లే తారక్ అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లుగా ఈ సమాధానం చెప్పారని టాక్.

The Backstory Of NTR's Sweet Warning To Fans

ఇండస్ట్రీ జనాలకు కొసరాజు హరికృష్ణ అంటే ఎవరో తెలియకపోయినా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి అంటే అందరికీ తెలుసు. కొసరాజు హరికృష్ణ.. కళ్యాణ్ రామ్ బామ్మర్ది. కాగా.. ఎన్టీఆర్ ఈర్ట్స్‌కు సంబంధించిన పనులన్నీ ఆయనే చూస్తూ.. సినిమా బడ్జెట్ మించ‌కుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అలాగే సినిమా క్వాలిటీ అవుట్ ఫుట్ విషయంలోను జాగ్రత్తలు తీసుకునే హరికృష్ణ గురించి కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడటం, మిస్ అండర్‌స్టాండ్ చేసుకోవడం పై జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఓపెన్ కామెంట్స్ చేశారట. కొసరాజు హరికృష్ణ మీడియాకు ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్లకు దూరంగా ఉంటాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఆవేశం వెనుక అసలు కారణాలు కూడా వేరని.. ఆ కామెంట్ అర్థం కావలసిన వాళ్ళకి అర్థమయ్యాయి అంటూ సమాచారం. తారకట్.. హరి పై అంత నమ్మకాన్ని పెట్టుకున్నారంటే అతని ప్రతిభ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఎన్టీఆర్, హరికి గ్యాప్ క్రియేట్ చేయాలని చేసిన ప్రయత్నల‌పై తారక్ అలా రియాక్ట్ అయ్యారని.. హరి విష‌యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇక ఇటీవల దేవర 1 సక్సెస్‌తో దేవర సీక్వెల్ పై కూడా ప్రేక్షకుల విపరీతమైన అంచనాలు పెరిగాయి.