బాల‌య్య త‌న‌యుడికి పోటీగా మ‌రో నంద‌మూరి వార‌సుడు ఎంట్రీ.. !

ఇటీవల బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక‌ మోక్షజ్ఞ ఫస్ట్ లుక్.. పోస్టర్ కూడా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వ‌ర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ తనయుడు సూర్య రామ్ అని తెలుస్తుంది. ఇటీవల కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన‌ సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ఫామ్ లో ఉన్నారు కళ్యాణ్ రామ్.

ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన మోక్షజ్ఞ.. మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం పక్కా అంటూ

ఇక ఎప్పటికప్పుడు సినిమా ఈవెంట్లకు సంబంధించిన పార్టీలలో కళ్యాణ్ రామ్ కుటుంబం మెరుస్తూనే ఉంటారు. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి కొడుకు సూర్యారామ్‌, కూతురు తారక అద్వైత గడిచిన కొన్నేళ్ల క్రితం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. కానీ.. చాలా కాలం నుంచి వీరి లేటెస్ట్ పిక్స్ బయటకు రాలేదు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్ళిన వీడియో ఒకటి నెటింట‌ వైరల్‌గా మారుతుంది. తన భార్య, పిల్లలతో కలిసి కళ్యాణ్ రామ్ హైదరాబాద్ ఎయిర్పోర్టులో వెళుతూ ఉండగా మీడియాకు చిక్కారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కళ్యాణ్ రామ్ కొడుకు, కూతుర్ని చూసి అంత ఆశ్చర్యపోతున్నారు.

Fans are Awestruck with Kalyan Ram's Family Pic!

ఎప్పుడో చిన్న వయసులో చూసిన ఈ ఇద్దరు అన్న, చెల్లెలు ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళు అయిపోయారు అంటూ ముచ్చటించుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు సూర్య.. నందమూరి వారసుడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడే అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ గతేడాది డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ హీరో.. నిర్మాతగా మాత్రం మంచి సక్సెస్‌ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తన తమ్ముడు సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ లాభాల బాట పడుతున్నారు. ఇటీవల దేవర సినిమాతో సక్సెస్ తో మరోసారి కళ్యాణ్ రామ్ లాభాలు గడిస్తున్నాడు.