‘ విశ్వం ‘ ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ డైరెక్టర్ శీను వైట్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెంకీ, దూకుడు లాంటి బ్లాక్ బ‌స్టర్లు ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. గత కొద్ది కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ రీసెంట్‌గా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాయి. నిర్మాత విశ్వ ప్రసాద్ కూడా.. వరుస సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నా.. చాలా వరకు సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ముగ్గురు కసిగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వం తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ధియేటర్‌లో సందడి చేసింది. నేడు ఓవ‌ర్‌సిస్ థియేటర్లలో షో పడిన ఈ సినిమా.. ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ మాట్లాడుతూ.. యాక్షన్స్ స‌నీవేశాల‌కు బోయపాటి పెట్టింది పేరు. అలాంటిది విశ్వం సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌తో శీను వైట్ల‌.. బోయపాటిని గుర్తు చేశాడంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక కామెడీ టైమింగ్స్, సన్నివేశాల్లో సీను వైట్లకు ఓ సపరేట్ స్టైల్ ఉంది. కాకపోతే అన్ని సినిమాల్లో ఒక కామన్ కాన్సెప్ట్ ఉంటుందని హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లడం.. లేదంటే హీరో ఇంటికి హీరోయిన్ రావడం లాంటిది జరుగుతూ ఉంటాయని విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి. ఇక ఈ కామన్ ఫార్ములాను పక్కన పెట్టి.. సినిమా చూసిన వాళ్లకు ఫస్ట్ అఫ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కామెడీ చక్కగా వర్కౌట్ అయిందని పలువురు నెటిజ‌న్స్‌ అభిప్రాయాల‌ని వ్యక్తం చేశారు.


ఇక శ్రీను వైట్ల ఎప్పటినుంచో ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ గురించి వెల్లడిస్తున్నారు. ఆయన చెప్పినట్లుగానే ట్రైన్ ఎపిసోడ్ బాగా హైలైట్ అయిందట. వెంకీ సినిమాలో ట్రైన్స్ సీక్వెన్స్‌ తరహాలోనే ఈ సీన్‌ హిట్ అవుతుందని ఆడియన్స్ ముందు నుంచి నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని శ్రీను వైట్ల నిలబెట్టారని.. సినిమా చూసిన నెటిజ‌న్ల కామెంట్స్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

ఇక హిట్ టాక్ వినబడుతున్న విశ్వం.. క్లైమాక్స్ పోర్ష‌న్‌.. చివరి 30 నిమిషాలు సినిమాను మరింత ఆసక్తిగా తీసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండేదని.. సినిమా చూసిన నెటిజ‌న్స్‌ చెబుతున్నారు. మొత్తం మీద వింటేజ్‌ సీను వైట్ల ఇస్ బ్యాక్ అంటూ ఎన్నారై ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి ఇండియాలో.. తెలుగు రాష్ట్రాల్లో.. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి టాక్ వ‌స్తుందో వేచి చూడాలి.