వనిత విజయ్ కుమార్ ఆ స్టార్ హీరోకి భార్య కావలసిందా.. కానీ.. !

నటి వనిత విజయ్ కుమార్ పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. దీనికి కారణం అమ్మ‌డి నాలుగో పెళ్లి వార్తలే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ కాంట్రవర్షియల్ బ్యూటీ.. మళ్ళీ పెళ్ళంటూ నాలుగో సారి కూడా మ్యారేజ్ కి సిద్ధం అయిపోయింది. ఇలాంటి క్రమంలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉండగా ఈ అమ్మడికి నాలుగో పెళ్లి అంత అవసరమా అంటూ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆకాష్‌, ఆనంద్, పీటర్ పాలు, ఇప్పుడు రాబర్ట్ ఇలా నలుగురిని వివాహం చేసుకున్న వ‌నితా.. ఈ నలుగురు కంటే ముందు స్టార్ హీరోను ప్రేమించిందట. అతనితో ఈమె పెళ్లి కావాల్సిందని.. కానీ ఆ అవకాశం వనిత విజయ్ కుమార్‌కు మిస్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వ‌నితా విజయ్ కుమార్ పెళ్లి చేసుకోవాల్సిన ఆ స్టార్ హీరో ఎవరు.. ఎందుకు ఆ ఛాన్స్ మిస్ అయిందో ఒకసారి తెలుసుకుందాం.

Tamil actor Vanitha Vijayakumar to tie the knot for fourth time; fiancé is  former beau Robert. See save-the-date pic | Tamil News - The Indian Express

స్టార్ నటులు విజయకుమార్, మంజుల ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోయారో తెలిసిందే. వీరిద్దరికీ ముగ్గురుకూతుళ్ళు. ముగ్గురు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు. ముగ్గురిలో పెద్ద కూతురే వనిత విజయ్ కుమార్. అయితే ఈమె మాత్రం నటనకంటే ఎక్కువగా కాంట్రవర్సీల‌తోనే పాపులారిటీ దక్కించుకుంది వనిత. తల్లి చనిపోయిన తర్వాత ఆస్తి విషయంలో తండ్రితో గొడవలు పడి కోర్టుకు ఎక్కింది. తండ్రితోను, చెల్లిళ‌తోను గొడవలు అయినా.. చిల్లి గవ్వ కూడా ఆమెకు దక్కలేదు. అంతేకాదు ఆమెను ఫ్యామిలీ మొత్తం పూర్తిగా దూరం పెట్టేశారు. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, సీరియల్ పాత్రలో నటిస్తూ రాణిస్తున్న వ‌నిత విజయ్ కుమార్ మొదట్లో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తో కలిసి తమిళ్ చంద్రలేఖ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Watch Chandralekha Full movie Online In HD | Find where to watch it online  on Justdial

ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో వరుస అవకాశాలు కూడా క్యూ కట్టాయి. కాగా చంద్రలేఖ మూవీ షూట్ టైంలోనే విజయ్ దళపతిని వనిత ప్రేమించిందట. అయితే అప్పటికి విజయ్ నటి సంగీత ప్రేమలో ఉండడం.. ఈ విషయాన్ని తెలుసుకున్న వనితకు హార్ట్ బ్రేక్ అయిందని తెలుస్తుంది. తర్వాత బ్యాడ్‌లక్ అనుకున్న వనిత విజయ్ కుమార్ చాలా బాధపడిందని కొంతకాలం డిప్రెషన్కు వెళ్లిందని టాక్. ఇక విజయకుమార్ ప్రేమని విజయ్‌ యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పటికే వనిత కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి భార్యగా సెటిలై ఉండేదని టాక్‌.