ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 6న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకులలో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. నార్త్ బెల్ట్‌లో సైతం ఆడియన్స్ పుష్ప 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.200 కోట్ల గ్రాస్ కాయమని ట్రేడ్ పండితుల అంచనా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సినిమాపై థియేట్రికల్ బిజినెస్‌లు పూర్తయ్యాయని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు ఏకంగా రూ.193.7 కోట్ల బిజినెస్‌లు జరిగాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌ఆర్ఆర్ తర్వాత హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే కావడం విశేషం. ఆర్‌ఆర్ఆర్ మూవీ పై తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.224 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఆలా ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప 2 బిజినెస్ పరంగా రెండవ స్థానంలో ఉన్నా.. కొన్ని ఏరియాల్లో మాత్రం ఆర్‌ఆర్ఆర్ ని కూడా క్రాస్ చేసేసి దూసుకుపోతుంది. ఉత్తరాంధ్రలో ఆర్ఆర్ఆర్ రైట్స్ రూ.23 కోట్లకు కొనుగోలు చేయగా.. పుష్ప 2పై రూ.23.4 కోట్లపై రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇక గుంటూరులో ఆర్‌ఆర్ఆర్‌పై రూ.14 కోట్ల వ్యాపారం జరగగా.. పుష్ప 2కి రూ.15.3 కోట్ల బిజినెస్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మిగిలిన ఏరియాలో ఆర్‌ఆర్ఆర్ కంటే.. పుష్ప 2కి తక్కువ బిజినెస్ జరిగిందట. నైజాంలో ఆర్‌ఆర్ఆర్ కు సమానంగా రూ.80 కోట్లు బిజినెస్ తో పుష్ప2 దూసుకుపోతుందని సమాచారం. సీడెడ్ బిజినెస్ పుష్ప 2కి రూ.30 కోట్ల బిజినెస్ అంటే రూ.20 కోట్ల తక్కువ డీల్ జరిగిందని తెలుస్తుంది. తూర్పుగోదావరిలో ఆర్ఆర్ఆర్ రూ.18 కోట్ల బిజినెస్ జరగగా పుష్ప2కి రూ.3.6 కోట్ల బిజినెస్ జరిగిందట. పశ్చిమగోదావరి ఆర్‌ఆర్ఆర్ పై రూ.16 కోట్ల బిజినెస్ జరిగితే పుష్ప2కి రూ.10.6 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే ఆర్‌ఆర్ఆర్.. రాజమౌళి బ్రాండ్ తో రావడం వల్ల భారీగా బిజినెస్ జరగడం.. దానికి తగ్గట్టుగానే టాక్ రావడంతో రెట్టింపు కలెక్షన్స్ ఎగ్జిబిటర్లకు దక్కాయి. ఇక పుష్ప 2 ఎలాంటి లాభాలు తెచ్చి పెడుతుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.