టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమా లైన్ అప్తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మిగతా స్టార్ హీరోస్ అంతా మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తుంటే.. ప్రభాస్ ఏడాదిలోనే ఒకటి రెండు సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంటునాడు. అంతే కాదు ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో వేల మందికి ఉపాధి కలుగుతుందనడంలో సందేహం లేదు. ఇక తాజాగా ప్రభాస్ నటించిన కల్కితో ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడో చూసాం. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2, సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ ఇలా దగ్గర దగ్గరగా అరడజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలోనే సీతారామం డైరెక్టర్ హనూ రాఘవపూడితో ఓ సినిమాను ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ రాజాకర్ ఉద్యమం నేపథ్యంలో సాగుతుంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ద్వారకలో స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఇక రెండో షెడ్యూల్ కు ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మేకర్స్. ఫౌజి వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ అర్థం సైనికుడు. ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ యువకుడు.. పాకిస్తాన్ యువతికి మధ్య సాగే ప్రేమ కథను సినిమాగా రూపొందిస్తున్నాడు హను రాఘవపూడి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభించి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఓ పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ మూవీ ఆగిపోయిందని టాక్. ఇక ఇటీవల కాలంలో ఏదైనా భారీ బడ్జెట్ మూవీ ప్రారంభించారు అంటే అది ఫౌజి మాత్రమే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో గ్రాండ్ లెవెల్ లో ప్రారంభం జరుపుకున్న ఈ సినిమా ఆగిపోయిందట.
మరోపక్క హనురాగవపూడి.. ప్రభాస్ కోసం చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక.. ఈ లోపు ప్రభాస్ లేని సన్నివేశాలన్నీ షూట్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఆగిపోయిందంటూ టాక్ కూడా వినిపించడంతో.. ఈ రెండిట్లో ఏది నిజం అనేది ఇప్పుడు ఆడియన్స్ లో సందేహంగా మారింది. దీనిపై మూవీ టీం రియాక్ట్ అయితే కానీ అసలు విషయం తెలియదు. ఇదిలా ఉంటే ఫౌజితో పాటు కేజీఎఫ్ ఫేమ్ యష్ కొత్త సినిమా టాక్సిక్ కూడా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అయితే సినిమా పేరు బయటకు రాకుండా ఇటీవల స్టార్ట్ అయిన ఓ పాన్ ఇండియన్ మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు వైరల్ అవడంతో.. ఇది టాక్సిక్ సినిమాకు సంబంధించిన రూమర్ ఏమో అని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్త ఫౌజికి సంబంధించినదా లేదా టాక్సిక్ కు సంబంధించిన తెలియాలంటే వేచి చూడాల్సిందే.