జయం రవితో రెండో మ్యారేజ్ కి సిద్ధమైన నాని బ్యూటీ.. సీక్రెట్ ఎంగేజ్మెంట్..!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఇమేజ్‌ సంపాదించుకొని వరుస‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న జయం రవికి టాలీవుడ్ లోను మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా జయం రవి పేరు నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం తన భార్య ఆర్తితో జయం రవి విడాకులు ప్రకటించడమే. దాదాపు 15 ఏళ్ల కాపురం తర్వాత ఇత‌ను భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికీ విడాకులపై ఆర్తి తనకు ఇష్టం లేన‌ట్లు అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంది. కానీ జయం రవి మాత్రం భార్యకు ఎలాగైనా విడాకులు ఇచ్చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఆర్తితో విడాకులు ప్రకటించిన జయం రవి.. తాజాగా నాని హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు టాక్. ఇంతకీ జయం రవి రెండో పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయి.. ఎంగేజ్మెంట్ చేసేసుకున్న ఆ యంగ్ బ్యూటీ ఎవరో కాదు.. ప్రియాంక మోహన్. తాజాగా నాని నటించిన బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సరిపోదా శనివారంలో.. హీరోయిన్‌గా నటించినా ప్రియాంకను జయం రవి పెళ్లి చేసుకోబోతున్నాడట. గోవాలో రహస్యంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని టాక్‌ నడుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు అసలు మ్యాటర్ ఇదేనా.. అందుకే ఆర్తికి విడాకులు ఇచ్చి ఇంతగా బాధపెట్టాడా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి కొంతమంది మాత్రం ఇది నిజమైన ఫోటోలు కాదు.. ఏదైనా సినిమాకి సంబంధించిన లేదా మరింకేదైనా షూట్ కు సంబంధించినవై ఉండాలి.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నిజం లేకున్నా ఇలాంటి ఫోటోలను వైరల్ చేస్తూ అబద్ధపు వార్తలు ఎన్నో వస్తున్నాయి అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జయం రవి హీరోగా నటిస్తున్న బ్రదర్ మూవీలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటల వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కనిపిస్తారు. దీనికి సంబంధించిన ఫోటోలే ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోలేదంటూ పలువురు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ లో ఉన్నది ఎంత నిజమో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.