టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో వివాదాలకు చాలా దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు అందరు స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాల విషయంలో ఆయన ఎంతో కష్టపడుతూ.. కథకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తన మేకవర్ మార్చుకొని 100 పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తాడు. అలా ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో మహేష్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అయితే కేవలం నటనలోనే కాదు.. మంచి పనులలోను మహేష్ ముందు ఉంటాడు. ఇప్పటివరకు ఏకంగా రూ.3772 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఈ సూపర్ స్టార్.. తన సంపాదన నుంచి ఇప్పటివరకు 30 శాతాన్ని వారి కోసం ఖర్చు చేశాడు.
ఈ క్రమంలో మహేష్ బాబు గోల్డెన్ హార్ట్ అంటూ ఎంతో మంది ప్రశంసలను అందుకున్నాడు. ఇలా మంచి పనులు చేయడంలో స్టార్ హీరోస్ ఎవరు మహేష్ బాబుకు సాటిరారని ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ జక్కన్న సినిమా కోసం మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి నుంచి సినిమా షూట్ ప్రారంభం కానుంది. అత్యంత భారీ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఇక మహేష్ ఈ సినిమాతో ఎన్నో రెట్లు మార్కెట్‌ను పెంచుకుంటాడు అనడంలో సందేహం లేదు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు రెండేళ్లుగా పనిచేశారు. ఇక దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించనున్నారట. ఇక సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ స్థాయిలో సక్సెస్ అందుకోవడం ఖాయమని.. తన నెక్స్ట్ ప్రాజెక్టులతో మహేష్ మరిన్ని సక్సెస్ లో అందుకోవాలని ఫ్యాన్స్ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.