సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన హ్యాండ్సమ్ లుక్.. నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా.. లక్కీ భాస్కర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీపావళి కానుకగా రానున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
కాగా సినిమా కోసం వర్క్ చేసిన టెక్నీషియన్ సినిమా గురించి మాట్లాడుతూ స్పెషల్ రివ్యూ ఇచ్చారు. దీంతో సినిమాపై ప్రేక్షకులో మరింత ఆశక్తి నెలకొంది. ప్రస్తుతం ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ పై ఇచ్చిన్న స్పెషల్ రివ్యూ నెటింట వైరల్‌గా మారుతుంది. నవీన్ నూలి సితార, హారిక &హాసిని వారి దాదాపు అన్ని సినిమాలకు ఆస్థాన ఎడిటర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా చేసిన నవీన్ మాట్లాడుతూ లక్కీ భాస్కర్ సినిమాకు తాను వర్క్ చేయడం ఎంతో ఆనందాన్ని కల్పించిందని.. లక్కీ భాస్కర్ సినిమా కోసం తాను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అంటూ వెల్లడించాడు.
కొన్ని సినిమాలకు పనిచేయడం ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలా లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అంటూ వెల్లడించారు. ఇటీవల కాలంలో ఏ సినిమా గురించి పోస్ట్ చేయని తాను లక్కీ భాస్కర్ గురించి ప్రత్యేకించి పోస్ట్ చేస్తూ మరి ఆశక్తికర కామెంట్స్ చేయడం ఆడియన్స్‌లో ఆసక్తిని కల్పిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ను చూపించడం చాలా బాగుందంటూ.. దర్శకుడు వెంకీ అట్లూరి, ప్రొడ్యూసర్ నాగవంశీలకు అభినందనలు తెలియజేశాడు. దీంతో లక్కీ భాస్కర్ కు ఆయన ఇచ్చిన పోస్ట్ స్పెషల్ రివ్యూ అనడంలో సందేహం లేదు.
#LuckyBaskhar was one of those projects that brought immense work satisfaction.
Successfully executing such a concept with expertise— applause to #VenkyAtluri and @vamsi84.And what a stellar performance by @dulQuer! #LuckyBaskharOnOct31st
🧨🧨🧨— Navin Nooli (@NavinNooli) October 28, 2024