వార్ 2 లో స్పెష‌ల్ సాంగ్‌… అబ్బో రెండు క‌ళ్లు చాల‌వ్‌గా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెర‌కెక్కనున్న తాజా మూవీ వార్ 2. మోస్ట్ అవైటెడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం శ‌ర‌వేగంగా జరుపుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజా స్కేడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే వచ్చే వారం నుంచి సరికొత్త స్కెడ్యూలను ప్రారంభిస్తారట. అలా తారక్, హృతిక్‌ నెక్స్ట్ షెడ్యూల్ పై ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ వైర‌ల్‌గా మారుతుంది.

War 2: Hrithik Roshan-Jr NTR Film To Have Action Scene Set In Japanese  Monastery | Republic World

నెక్స్ట్ స్కెడ్యూల్‌లో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని.. అందుకోసం భారీ సెట్లు ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సాంగ్ ఎవరిపై సాగుతుంది అనేదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ ఈ సాంగ్లో ఎన్టీఆర్ హృతిక్‌ ఇద్దరు కలిసి చిందులు వేస్తే కనుక.. సినిమాకే ఈ సాంగ్ హైలెట్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేప‌ధ్యంలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒకే స్టేజిపై ఐటెం పాపతో చిందేస్తుంటే.. రెండు కళ్ళు చాలవంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

War 2: Jr Ntr Undergoes Transformation For His Bombastic Face-Off With  Hrithik Roshan – All About The 10-Day Long Schedule! - IMDb

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియన్ మల్టీ స్టార‌ర్‌లో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. పైగా ఎన్టీఆర్ హృతిక్ లాంటి పాన్ ఇండియన్ ఇమేజ్ కలిగిన స్టార్ హీరోల కాంబోలో సినిమా రాబోతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే వార్ 2 లో హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందని.. ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. ఇదో యాక్షన్ ఫిలిం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ ప్రియులంతా వారట్2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మాత ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్లో సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.