ఈ ఫోటోలో బాలయ్యతో ఉన్న పాప.. పెద్దయ్యాక ఆయన ప‌క్క‌నే హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో బాలకృష్ణతో కలిసి కనిపిస్తున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. బాలనాటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దదైన తర్వాత హీరోయిన్గా రాణించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన నటులతో సత్తా చాటుకుంది. హోమ్లీ బ్యూటీగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. యూత్ లోను విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అమ్మ‌డి సినిమాలన్నీ సక్సెస్ అందుకోవడంతో అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్గా మారింది.

Krishna Babu Telugu Full Movie | Balakrishna, Raasi, Meena | Sri Balaji  Video - YouTube

అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. అమ్మడి డిమాండ్, క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అలా 2017 వరకు పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఏ ముద్దుగుమ్మ.. తర్వాత కొంతకాలం సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పలు సీరియల్స్ లో నటిస్తూనే.. సినిమాల్లోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా.. తనే స్టార్ హీరోయిన్ రాశి. బాలగోపాలుడు సినిమాలో బాలకృష్ణ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఆ పక్కన ఉన్న కుర్రాడు కళ్యాణ్ రామ్. అలా చిన్నతనంలోనే ఈమె రావు గారి ఇల్లు, మమతల కోవెల, చెట్టు కింద ప్లీడర్, ఆదిత్య 369, అంకురం, పల్నాటి పౌరుషం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

marriages, actress Rashi, latest news, three marriages, tollywood news,  telugu movies,

పెద్దయ్యక లవ్ టు డే.. తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దళపతి హీరోగా నటించిన సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఇదే సినిమాను సుస్వాగతం పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా.. ఇక్కడ కూడా అమ్మడికి మంచి ఇమేజ్ వచ్చింది. ఇక అప్పట్లో రాశి క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది. కేవలం ఒక్క 1997 లోనే 11 సినిమాల్లో హీరోయిన్గా నటించి దాదుపు అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుంది. తర్వాత 1998లో 10 సినిమాలు, 1999 లో 13 సినిమాలు ఎలా మొత్తం మూడు సంవత్సరాల్లో 34 సినిమాల్లో హీరోయిన్గా రాణించింది. బాలనాటిగా.. బాలయ్య బాలగోపాలుడు, ఆదిత్య 369 లో రాణించిన ఈ అమ్మడు.. పెద్దయిన్న తర్వాత హీరోయిన్ గా కృష్ణ బాబు సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. కాగా 2007 సంవత్సరం వరకు ఈమె వరుసగా ఏడాదికి పది నుంచి 13 సినిమాలు చేస్తూ.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిన ఏకైక హీరోయిన్ రాశి.