టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు బిజీగా గడుపుతున్నాడు జక్కన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో కథరచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రేక్షకులంతా వీక్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక రాజమౌళి కూడా సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక సినిమాలో విలన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందట.
దానికి తగ్గట్లుగా గట్టి పోటీ ఇస్తూ నటించే విలన్ కావాలని జక్కన్న.. ఈ నేపధ్యంలో విలన్ పాత్ర కోసం వేట మొదలైందని సమాచారం. అయితే ఈ వేటలో భాగంగా టాలీవుడ్ నటుడు రానా ని సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదివరకే రానా.. రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. బళ్లాలదేవాగా పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్న రానా.. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో నటుడిగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబుని ఢీకొట్టేందుకు రానా అయితేనే సరైన విలన్ అని.. జక్కన్న భావిస్తున్నాడట. అందుకే రానా ను సెలెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రానా కూడా కొంతకాలం నుంచి కేవలం హీరో పాత్రలకే కాదు.. పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తే విలన్ పాత్రలో నటించడానికి కూడా సై అంటున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ లో నెగిటివ్ రోల్ ప్లే చేశారు. అంతేకాదు రజనీకాంత్ వెట్టయాన్‌లోను రానా విలన్‌గా కనిపిస్తారు. అలా తాజా సమాచారం ప్రకారం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా కోసం కూడా రానాని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాగా ఇప్పటికే మహేష్ జక్కన్న కాంబో మూవీ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.