గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో త్రో బ్యాక్ థీంతో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్.. వారికి సంబంధించిన అప్డేట్స్ నెటింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ యాక్టర్ల బయోగ్రఫీ.. వారి బ్యాగ్రౌండ్ లాంటివి తెలుసుకొనేందుకు నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బుజ్జాయి పిక్ తెగ వైరల్ గా మారుతుంది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన మెప్పించింది. చిన్నప్పుడు బోసి నవ్వులతో ముద్దు.. ముద్దుగా.. కనిపించిన ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్‌ను ఏలేసింది. యోధురాలి పాత్రల్లోను నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. తను మరెవరో కాదు అనుష్క శెట్టి.
ఈ ఫోటోలో తనతో ఉంది అనుష్క అన్న. ఇక అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అభిమానం ఉంటుందో.. అనుష్కకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2005లో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. 2006లో రెండు సినిమాతో కోలీవుడ్ లోనూ అవకాశాన్ని దక్కించుకుంది. ఆర్ మాధవన్‌తో ఆడి పాడిన ఈమె.. సౌత్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లోనూ అమ్మడు నటించి ఆకట్టుకుంది. జక్కన ఓ సినిమాలో హీరోయిన్‌ను మరో సినిమాలో రిపీట్ చేయరు. అలా ఆయన సినిమాల్లో రిపీట్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్ అనుష్క. రాజమౌళి డైరెక్షన్‌లో మొదట విక్రమార్కుడు సినిమాలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. తర్వాత బాహుబలి సిరీస్లలోను ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది.
సినిమాతో తన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగింది. ముఖ్యంగా బాహుబలి సిరీస్ కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, 2017 లో రిలీజ్ అయిన బాహుబలి 2.. కంక్లూషన్ సినిమాలు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.2500 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్నాయి. బాహుబలి తర్వాత భాగమతి మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. చాలా కాలం గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి రెండు కొత్త సినిమాలతో బిజీగా పడుతుంది. తెలుగులో కృష్ డైరెక్షన్‌లో ఘాటి మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కథనాటి వైల్డ్ సార్సరర్ సినిమాలోని నటిస్తుంది. ఈ సినిమా మలయాళం ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందుతుంది.