స్టార్ హీరోతో ఎఫైర్ వార్తులపై సింగ‌ర షాకింగ్ రియాక్ష‌న్.. ఇది మి ప్రాబ్ల‌మ్ కాదంటూ..

తమిళ్ స్టార్ హీరో జయం రవి.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన జయం రవి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు. స్టార్ సెలబ్రిటీగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన 15 ఏళ్ల కాపురానికి డివోర్స్‌తో చెక్ పెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు జయం రవి. విడాకుల గురించి నాకేమీ తెలియదు అంటూ.. తన భార్య ఆర్తి సోషల్ మీడియాలో మ‌రో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ నేపథ్యంలోనే జయం రవి తన భార్య.. తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని.. ఆ ఇంట్లో ఉన్న తన వస్తువులన్నీ తనకు ఇచ్చేయాలంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ప్రస్తుతం వీరి మ్యాటర్ నెటింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే జయంరవి.. తన భార్యతో విడాకులు తీసుకోవడానికి స్టార్ సింగర్ కారణమంటూ.. పుకార్లు ఇటీవల తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై తాజాగా జయం రవి రియాక్టర్ అవుతూ.. అవన్నీ పుకార్లు మాత్రమేనని.. ఆ సింగ‌ర్‌ను ఈ గొడవలోకి లాగొద్దంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను అన్ని ఆధారాలతో కొర్ట్‌కు వెళుతున్నట్లు.. పరిష్కారం కోరుతున్నట్లు వెల్ల‌డించాడు.

తాజాగా దీనిపై ఆ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ కూడా రియాక్ట్ అయింది. తన ఇన్‌స్టా వేదికగా ఆమె మాట్లాడుతూ.. అందరూ వినయపూర్వకంగా ఉండమని చెబుతున్నా. దయచేసి ఈ వివాదానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఇంటి గొడవ కాదు.. మరొకరిది. అలాంటి సమయంలో ఈ విషయంలో మీకు నచ్చిన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీరు అర్హులు కాదు. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దయచేసి కామ్ గా ఉండాల్సిన అవసరం ఉందంటూ అభ్యర్థిస్తున్న. ఈ విషయంపై నేను ఏ ఇతర మీడియాల‌తో మాట్లాడను అంటూ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట సంచలనంగా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by KENEESHAA (@kenishaafrancis)